Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పుడే అడ్మిషన్ల గోల... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

అప్పుడే అడ్మిషన్ల గోల...

- వచ్చే విద్యాసంవత్సరంలో చేరాలంటూ ప్రకటన
- దోపిడీకి తెరలేపిన ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లు
- చోద్యం చూస్తున్న పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం కొనసాగుతున్నది. ఇప్పుడిప్పుడే చదువులు గాడిన పడుతున్నాయి. విద్యార్థులు బడులకు రావడం, ఉపాధ్యాయులు పాఠాలను బోధించడం సాగుతున్నది. అయితే ఫీజు దోపిడీకి ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లు తెరలేపాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియనే లేదు. అప్పుడే అడ్మిషన్ల గోల మొదలైంది. వచ్చే విద్యాసంవత్సరం (2023-24)లో చేరాలంటూ అవి ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రీప్రైమరీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందంటూ హైదరాబాద్‌లో ప్రముఖ ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ప్రకటించడం గమనార్హం. ముందే సీటు రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నాయి. రంగురంగుల ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో 40,597 పాఠశాలలున్నాయి. వాటిలో 10,549 ప్రయివేటు స్కూళ్లున్నాయి. ఇందులో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉండే ప్రముఖ పాఠశాలలే ప్రవేశాల ప్రక్రియకు ప్రకటనలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించే స్కూళ్లు ముందువరుసలో ఉన్నాయి. అయితే కాలేజీల్లో ఉన్నట్టుగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు షెడ్యూల్‌ అంటూ ఏమీ లేదా?అన్న ప్రశ్నకు 'ఇంటర్‌లో చేరాలంటే పదో తరగతి పాస్‌ కావాలి. డిగ్రీలో ప్రవేశం పొందాలంటే ఇంటర్‌ పూర్తి కావాలి. ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఎంసెట్‌ ఉత్తీర్ణత కావాలి. కానీ పాఠశాలల్లో ప్రీప్రైమరీలో ప్రవేశం కావాలంటే అంతకుముందు చదివి ఉండాలన్న నిబంధన లేదు. కాబట్టి ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.'అని పాఠశాల విద్యాశాఖలో ఓ అధికారి సమాధామిచ్చారు. అయితే సర్కారు బడుల్లో ప్రవేశాల ప్రక్రియ మాత్రం వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభమవుతుంది. అదీ ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు చేపట్టడంతో విద్యార్థులు ఎక్కువ మంది ఇప్పుడే చేరతారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు, పేద విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ, మండల ప్రాంతాల్లోనే అవగాహన లేని పిల్లలు వాటిలో చేరకుండా మిగిలిపోతారు. వారే సర్కారు చేరేందుకు మొగ్గుచూపుతారు. అందుకే ఏటా సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతున్నది.
అనివార్యంగా ప్రయివేటుకు...
ప్రభుత్వ విద్యావ్యవస్థను మెరుగుపరుస్తామంటూ పాలకులు అర్భాటాలు చేసినా ఆచరణలో అవి కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మరోవైపు ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. విద్యావాలంటీర్లను కూడా నియమించలేదు. దీంతో పిల్లల బతుకులు కూడా ఎక్కడ తమలాగా మారతాయోనన్న భయంతో అనివార్యంగా తల్లిదండ్రులు ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆ పాఠశాలల్లో ఉండే ఫీజులను చూసి హడలెత్తిపోతున్నారు. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో వారి ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఇంకోవైపు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. దీంతో సామాన్యులు, పేదలు, బలహీనవర్గాలకు చెందిన తల్లిదండ్రులు ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీజులను చూసి భయపడిపోతున్నారు. అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటిలో చేర్పించేందుకే మొగ్గుచూపుతున్నారు. డబ్బున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలో ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకటన వచ్చిన వెంటనే ఆ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వారి వద్ద డబ్బున్నా ముందే పిల్లలను చేర్పించడంతో రాయితీ లభిస్తున్నది. కానీ డబ్బులేని వారు ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించడానికి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక వస్తారు. వారికి ఫీజులో రాయితీ ఉండదు. మొత్తం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి సీట్లు నిండితే దొరకని పరిస్థితి తలెత్తుతుంది. ఇంకోవైపు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిదండ్రులపై పెనుభారం పడనుంది. అందుకే వారు ఆ ఫీజుల భారాన్ని చూసి బెంబేలెత్తుతున్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.