Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొందరికే ఉపాధ్యాయ బదిలీలు! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

కొందరికే ఉపాధ్యాయ బదిలీలు!

- ఫిబ్రవరి 1 నాటికి రెండేండ్ల సర్వీసు ఉన్నోళ్లే అర్హులు
- అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వని ప్రభుత్వం
- టీచర్లు 8 ఏండ్లు, హెచ్‌ఎంలు 5 ఏండ్లు పనిచేస్తే స్థానచలనం తప్పనిసరి
- మార్గదర్శకాల రూపకల్పనలో విద్యాశాఖ అధికారులు
- అతి త్వరలోనే ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగంసిద్ధమైంది. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. ఇక మార్గదర్శకాల రూపకల్పనలో విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండేండ్ల సర్వీసు నిండిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడంలేదు. అంటే కొందరికే బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హులుగా ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)ల సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి వారికి ఇచ్చినట్టు తెలిసింది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి రెండేండ్ల సర్వీసు ఉండాలని నిర్ణయించింది. ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యాజమాన్యాల వారీగా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలుంటాయని స్పష్టం చేసింది. ఎన్‌సీసీ అధికారులకు మాత్రం ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశమున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నాటికి ఒక పాఠశాలలో ఐదేండ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం), ఎనిమిదేండ్లు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుందని ప్రకటించింది. మూడేండ్లలోపు ఉద్యోగ విరమణ పొందే హెచ్‌ఎంలు, టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. 50 ఏండ్లలోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేయాలని నిర్ణయించింది. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 ఏండ్ల వయసు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి కల్పించింది. పదోతరగతి సామర్థ్యం పాయింట్లు, సర్వీస్‌ పాయింట్లను ప్రభుత్వం తొలగించింది. స్పౌజ్‌, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి. ఎనిమిదేళ్ళలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్‌ వర్తింపజేసింది. ఓడీ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు, గుర్తింపు పొందిన సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి. ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్‌ పాయింట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్‌ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయని వివరించింది.
కలెక్టర్‌ చైర్మెన్‌గా కమిటీ
మల్టీజోన్‌ స్థాయిలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్‌ఈ) ద్వారా నామినేట్‌ చేయబడిన జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి సీనియర్‌ అధికారి చైర్మెన్‌గా, ఆర్జేడీ సెక్రెటరీగా, సంబంధిత డీఈఓ సభ్యునిగా కౌన్సెలింగ్‌ కమిటీ ఉంటుందని మార్గదర్శకాల్లో విద్యాశాఖ ప్రతిపాదించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్‌ చైర్మెన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ వైస్‌ చైర్మెన్‌గా, జెడ్పీ సీఈఓ సభ్యునిగా, డీఈఓ సెక్రెటరీగా కమిటీ ఉంటుందని తెలిపింది. జిల్లా స్థాయిలో జెడ్పీ, ఎంపీ టీచర్లకు జెడ్పీ చైర్‌పర్సన్‌ చైర్మెన్‌గా, కలెక్టర్‌ వైస్‌ చైర్మెన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌, సీఈఓ సభ్యులుగా, డీఈఓ కార్యదర్శిగా కమిటీ ఉంటుందని వివరించింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు డీఈఓ, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొంది. బదిలీ ఉత్తర్వులు పొందిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులందరూ ఈ విద్యా సంవత్సరం (2022-23) చివరి పనిదినం (ఏప్రిల్‌ 24న) మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి బదిలీ అయిన పాఠశాలలో చేరతారని పొందు పరిచింది. అయితే ముసాయిదా మార్గదర్శకాల్లో మార్పులుండే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. అతి త్వరలోనే మార్గదర్శకా లతో కూడిన ఉత్తర్వులు వెలువరించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పరిశీలకుల నియామకం
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా చేపట్టేందుకు ప్రభుత్వం వివిధ జిల్లాలకు విద్యాశాఖ ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించింది. వికారాబాద్‌కు జి ఉషారాణి, జోగులాంబ గద్వాలకు ఎ ఉషారాణి, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాలకు ఎస్‌ శ్రీనివాసాచారి, జగిత్యాలకు పి రాజీవ్‌, కరీంనగర్‌, మెదక్‌కు ఎ కృష్ణారావు, మహబూబాబాద్‌కు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లికి పి మదన్‌ మోహన్‌, భద్రాద్రి కొత్తగూడెంకు బి వెంకటనర్సమ్మను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జీరో సర్వీసు టీచర్లకు అవకాశమివ్వాలి : పీఆర్టీయూ తెలంగాణ
బదిలీలకు కనీసం రెండేండ్ల సర్వీసు కాకుండా జీరో సర్వీసు ఉన్న వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్‌ఎం గ్రేడ్‌-2 పదోన్నతులను ఆప్‌లైన్‌లో నిర్వహించాలని సూచించారు. వెబ్‌ఆప్షన్లలో నాట్‌ విల్లింగ్‌ ఆప్షన్‌ను కేటాయించాలని తెలిపారు. ఎస్జీటీలకు ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో అవకాశం ఉన్న వారికి అందరికీ న్యాయం చేయాలని పేర్కొన్నారు.
రెండేండ్ల సర్వీసు నిబంధనను సడలించాలి : యూఎస్‌పీసీ, టీఎస్‌యూటీఎఫ్‌
బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు రెండేండ్ల కనీస సర్వీసు నిబంధనను సడలించాలని ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను మంగళ వారం హైదరాబాద్‌లో యూఎస్‌పీసీ ప్రతినిధులు కె జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, టి లింగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశమివ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులను అన్ని ఖాళీలూ చూపకుండా పాఠశాలల అవసరం పేరుతో మారు మూల పాఠశాలలకు కేటాయించారని తెలిపారు. ఇతర జిల్లాలకు అర్ధాంతరంగా బదిలీ కావడంతో స్టేషన్‌ సర్వీసు పాయింట్లు కోల్పోయారని పేర్కొన్నా రు. వికలాంగులు కూడా అననుకూల పాఠశాలల్లో నియమించబడ్డారని వివరించారు. ఇప్పుడు అందరి కీ బదిలీ అవకాశం ఇవ్వకపోవటం అన్యాయమని ఆ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలి పారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ కనుక జీరో సర్వీసుతో బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చినా ప్రభుత్వానికి ఆర్థికంగాగానీ, పరిపాలనా పరంగాగానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదబోదని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.