Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అనుకున్న టైంకు సిద్ధం చేయాలి... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

అనుకున్న టైంకు సిద్ధం చేయాలి...

- నూతన సచివాలయ పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్‌
- ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12.30 గంటల మధ్య ప్రారంభం
- ఇద్దరు సీఎంలు, ప్రకాశ్‌ అంబేద్కర్‌ రాక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నూతన సచివాలయ పనులు కీలకదశకు చేరుకుంటున్నాయి. ముహుర్తం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం మధ్యాహ్నాం ఏకంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్వయానా పనులు తనిఖీ చేశారు. సచివాలయ నిర్మాణ పనులను సాంతం పరిశీలించారు. గ్రౌండ్‌ నుంచి ఆరో అంతస్థు వరకు సీఎం వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు.
ముహుర్తం
నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముహుర్తం నిర్ణయించారు. ఈ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయ భవనంగా సీఎం కేసీఆర్‌ నామకరణం చేసిన విషయమూ విదితమే. ఆయనే ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నామని అధికారవర్గాలు తెలిపాయి.
ప్రారంభోత్సవానికి హాజరు కానున్న ముఖ్యమంత్రులు
సీఎం కేసీఆర్‌ ప్రారంభించే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు సమాచారం.
అంబేద్కర్‌ భవన్‌ పనులు...విశిష్టతలు
హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగనిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్‌ అంబేద్కర్‌, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమవుతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజా పరిపాలనా సౌధం.. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ దార్శనికత, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి, వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌తో రాష్ట్ర సచివాలయం నిర్మాణవుతున్నది. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియతిరిగి అణువణువునూ సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహా ఇంజినీర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం గుండా పనులు తనిఖీ చేపట్టారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న ప్రహారిగోడ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మిస్తున్న రోడ్లనూ పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన సీఎం, అక్కడ బ్యాంకులు, క్యాంటీన్‌, ఏటీఎంలు, మీడియా సెంటర్‌ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్‌ హాళ్లను చూశారు. అక్కడి సౌకర్యాలు తదితర వివరాలను, ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు వివరించారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిశలో కడుతున్న ప్రార్థనా మందిరాన్ని సీిఎం తిలకించారు. ఆ తర్వాత పడమటి వైపు ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతపై సీఎం ఆరా తీశారు. పడమటలో సచివాలయ ఉద్యోగుల అవసరాల కోసం కడుతున్న భవనాన్ని కూడా సీఎం చూశారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులనూ పరిశీలించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రాంతాలను సీఎం సందర్శించారు. అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి అంతస్థుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజినీర్లకు సూచించారు. తొలి అంతస్థు కలియదిరిగిన సీఎం లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సీఎం చాంబర్‌కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్‌ సీలింగ్‌, వుడ్‌ ప్యానెలింగ్‌, ఎసీ ఫిట్టింగులు తదితర తుది మెరుగుల పనులను సీఎం క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం , చీఫ్‌ సెక్రటరీ ఛాంబర్‌ను, సీఎంవో కార్యదర్శులు, పీఆర్వోలు, తదితర సీఎంవో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సీఎం పరిశీలించారు. సీఎం ఛాంబర్‌లో మార్పులు చేయాలని సూచించారు. అదే ఫ్లోర్‌ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌ హాళ్లను వాటిల్లో చేపట్టిన ఫాల్స్‌ సీలింగ్‌ పనులను పరిశీలించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్‌ పాలిషింగ్‌, పెయింటింగ్‌ పనులు, ఎలివేషన్‌లో భాగంగా జీఆర్సీ తో చేసే కళాకతులు, చివరిదశ పనులను మరింత సజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగల్‌ బూస్టింగ్‌ సిస్టమ్‌ను సీఎం తనిఖీ చేశారు. ఆరవ అంతస్తు నుంచి అటు హుస్సేన్‌సాగర్‌ తీరం వైపు నిర్మితమవుతునన కట్టడాలను కిటికీ నుంచి బయటికి వంగి చూసారు.
ఇంటీరియర్‌ డిజైన్లు, కరెంటు పనులు, ఏసీల ఫిట్టింగ్‌, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్‌ వర్కు పనులు, పెయింటింగ్‌ పనులను పరిశీలించిన సీఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమీయం మార్బుల్‌ స్టోనింగ్‌, వుడ్‌ పనులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్‌ , మార్బుల్‌ , ఫాల్స్‌ సీలింగ్‌, జీఆర్సి పనులు, లిఫ్టుల పనుల తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఆరవ ఫ్లోర్‌ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సీఎం మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కడనుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమవుతున్న లాన్‌, రోడ్లు, పార్కింగ్‌తోపాటు గార్డెనింగ్‌ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్‌ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ కలియతిరిగారు.
వీఆర్వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లు, జనరేటర్లు అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ను సీఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ లైట్లను పరిశీలించారు. ల్యాండ్‌ స్కేప్‌, సివరేజ్‌ వర్క్స్‌, రెడ్‌ సాండ్‌ స్టోన్‌, ఫైర్‌ వర్క్స్‌, ఎలక్ట్రికల్‌ వర్క్‌ ఫ్లోర్‌ పనులపై ఇంజినీర్లకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్‌, దివాకర్‌ రావు బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.