Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలను విస్మరించిన కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

పేదలను విస్మరించిన కేంద్రం

- అన్ని వర్గాలకూ ప్రతికూలం
- గణనీయంగా తగ్గిన కేటాయింపులు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 2023-24 కార్పొరేట్లకు తప్ప ప్రజలకు ఏమాత్రమూ ఉపయోగపడదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జిమ్మిక్కులు, ఆర్భాటం తప్ప ఇది పూర్తిగా డొల్లతనంతో కూడిన బడ్జెట్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సమావేశానికి హాజరైన తమ్మినేని, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదన్నారు. నిజాన్ని దాచి అందమైన చిత్రాన్ని చూపేందుకు ఆర్థిక సర్వే ప్రయత్నించిందని విమర్శించారు. నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య తదితర ముఖ్యమైన సమస్యలను బడ్జెట్‌ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తినిస్తుందని కేంద్రం చెబుతున్నదని, మరి ఆర్థిక వృద్ధిరేటు 6.5శాతానికే పరిమితమవుతుందని ఆర్థిక సర్వే ఎందుకు అంచనా వేసిందని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగం వృద్ధిరేటు 9.9శాతం నుంచి 1.6శాతానికి పడిపోయిందన్నారు. ఏకబిగిన నాలుగేండ్ల ఆర్థికవృద్ధి తగ్గటం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఆహార సబ్సిడీని 29 శాతానికి తగ్గించారని, మధ్యాహ్న భోజనానికి నిధులు 9.4శాతం తగ్గాయని, పౌష్టికాహార పథకాలకు ఏకంగా 38 శాతం తగ్గా యని విమర్శించారు. బడ్జెట్లో అణగారిన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారన్నారు. నీతి ఆయోగ్‌ మార్గదర్శకాల ప్రకారం షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు తప్పనిసరి అన్నారు. ఈ బడ్జెట్‌లో అలాంటివేవీ చోటు చేసుకోలేదని తెలిపారు. వికలాంగులపైన కేంద్రం వివక్ష చూపిందని, మైనారిటీలకైతే బడ్జెట్‌లో గతేడాది కంటే ఏకంగా 33 శాతం నిధులను తగ్గిం చిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటే ఓశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బొంతు రాంబాబు, వై.విక్రమ్‌, చింతలచెర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బండి రమేష్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.