Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీకే అమృత కాలం..జనానికి ఆపద కాలం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

బీజేపీకే అమృత కాలం..జనానికి ఆపద కాలం

- అంత్యోదయను వదిలేసి.. అదానీ సిద్ధాంతంవైపు
- ప్రజలపై మోడీ లక్షల కోట్ల అప్పు
- బీజేపీపై ఆర్థికమంత్రి తీవ్ర విమర్శలు
- బడ్జెట్‌పై హరీశ్‌రావు సమాధానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
         సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిరాభివృద్ధి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బడ్జెట్‌పై బుధవారం శాసనసభలో సుదీర్ఘ చర్చ చోటుచేసుకుంది. శాసనసభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, అక్భరుద్దీన్‌ ఓవైసీ, ఈటల రాజేందర్‌, గువ్వల బాలరాజు తదితర సభ్యులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ, తెలుగుదేశంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, బీజేపీ తప్పిదాలను ఎత్తిచూపారు. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలు, ఫలితాలు చెబుతూనే, కేంద్రంలోని బీజేపీ పాలన, దుష్పరిణామాలు, గత పాలకుల విధానాలు, అప్పటి పరిస్థితుల గురించి వివరించారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నదన్నారు. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నదనీ, కానీ ప్రతిపక్షాల తీరు 'నిండుపున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుంది' అంటూ మంత్రి హరీశ్‌ తీవ్రంగా స్పందించారు. వెనుకటికి ఏం వంక అంటే.. ఏలువంక అన్న చందంగా బీజేపీ, కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్నాయని చెప్పారు. బడ్జెట్‌లో అధికంగా నిధులు పేదలు, బడు బలహీన వర్గాల కోసం కేటాయించామన్నారు. విపక్షాల మాటలు వింటుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు ఏమి చేయొద్దన్నట్టుగా అర్థమమవుతున్నదని చెప్పారు. సమాధానం ఆయన మాటల్లోనే...
వృద్ధులకు రక్షణ.. పిల్లలకు పోషణ
         బడ్జెట్‌లో ముసలవ్వలకు రక్షణ ఉంది. పసిపిల్లలకు పోషణ, బడి పిల్లలకు శిక్షణ, ఉన్నత విద్యకు ఉపకారం, యువత ఉద్యోగ కల్పన, ఆరిపోని కరెంటు వెలుగులు ఉన్నాయి. నదీ జలాలను ఎత్తిపోసే విజయాలున్నాయి. మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలు, చెరువులో చేపపిల్లల మిలమిలలు, జలరాశుల గలగలలు, ధాన్యరాశుల కళకళలున్నాయి.
         రైతుల ముఖంపై విరబూస్తున్న చిరునవ్వులు, గొర్రెల మందల అరుపులు, గొళ్లకురుమల కండ్లలో మెరుపులు, నేతన్నకు భరోసా, గీతన్నకు కులాసా ఉన్నవి. దళితబంధు ఇచ్చే దిలాసా, ఆకుపచ్చని అడవులు, మళ్లీ ఊపిరిపోసుకున్న పక్షి జాతులున్నారు, కాలుష్యంపై కథనం ఉంది.. పర్యావరణ సమతుల్యం ఉన్నది.. పేదింటి ఆడపిల్లల పెళ్లిపందిళ్లున్నాయి.. వారి తల్లిదండ్రుల కండ్లల్లో ఆనంద భాష్పాలున్నాయి. కంటి వెలుగు కాంతి ఉంది.. కొత్త హాస్పిటళ్లు ఉన్నాయి.. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉంది. పెరిగిన బెడ్లు ఉన్నరు.. చికిత్స మార్గం ఉంది.. ఆరోగ్య భాగ్యం.. సబ్బండ వర్ణాల సంక్షేమం ఉంది. సకలజనుల సౌభాగ్యం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది. ఇవి ప్రతిపక్షాలకు కనపడకపోతే మేం ఏం చేయాలి' అని మంత్రి ప్రశ్నించారు.
గతంలో ఖాళీ బిందెల ప్రదర్శనే
         'గతంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచో, తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచో ఖాళీ బిందెల ప్రదర్శనలతో అసెంబ్లీకి వచ్చేవాళ్లం. మొదటిరోజు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి మీద విపక్షాలన్నీ వాయిదా తీర్మానం ఇచ్చేవి. మొదటి వాయిదా తీర్మానం కరెంటు కోతలు, తాగునీటి బాధలపై ఉండేవి. బడ్జెట్‌ సమావేశాల్లో మంచినీటి కొరత గురించి మాట్లాడకుండా సభ జరిగిందే లేదు. మిషన్‌ భగీరథ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజైనా భట్టీ విక్రమార్క గానీ, ఇతర విపక్ష సభ్యులుగానీ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీర్మానాలు ఇచ్చారా? వాగ్యుద్ధాలు ఉన్నాయా? ఖాళీ కుండల ప్రదర్శన ఉందా? ఇవన్నీ లేవంటే ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని ఒప్పుకున్నట్టే కదా? ఇంత మంచి పని జరిగితే ఒక్కనాడైన మంచి అని అన్నారా ? అంటూ వ్యంగ్య వాఖ్యానం చేశారు.
యథావిధిగా డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం
         డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం యథావిధిగా కొనసాగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు డీఏల్లో మొన్న ఒక డీఏ ఇచ్చాం. మరో రెండు డీఏలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. న్యూ ఉస్మానియా బిల్డింగ్‌ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యునాని హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. ఎలాంటి కొత్త పన్నులు వేయం. సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ సమస్యలు లేకపోతే.. పవర్‌ హాలిడేలు, క్రాప్‌ హాలిడేలు ఎందుకు ప్రకటించారు. ఇందిరా పార్క్‌ వద్ద పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చిందని హరీశ్‌రావు భట్టిని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తీసుకొస్తే.. ఇదే సభలో దివంగత ఎమ్మెల్యే పీజేఆర్‌ నీళ్ల గురించి ఎందుకు ప్రశ్నించారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్‌ పాలసీ రెడీగా ఉంది. ఆ పాలసీని త్వరలోనే ప్రకటిస్తాం. క్రీడల విషయంలో ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తున్నది.
పాలకులకు అమత్‌కాలమైతే ప్రజలకు ఆపద కాలం
         దేశ పాలకులకు ఇది అమత్‌ కాలమైతే.. ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలం. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకంతో దేశం ముందు ఓ మోడల్‌ను పెట్టింది. దీన్ని చూసి కూడా మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేక పోతున్నరు. నిధులు లేకనా? నీళ్లు లేకనా? అసలు విషయం ప్రజల పట్ల ప్రేమ, మమకారం లేకపోవడం. ఏ రాష్ట్రంలోనూ మన తరహాలో పథకాలు అమలుకావడం లేదు. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్‌. కానీ, సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి పాలిటిక్స్‌ ఒక టాస్క్‌. ఏ లక్ష్యాన్ని అయినా పట్టుదలతో పూర్తిచేసే లా ప్రజల కోణంలో, మానవీయ కోణంలో పని చేసేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. మూడునాలుగేండ్ల్లల్లో పూర్తి చేయడం ఓ భగీరథ యత్నం. సీఎం కేసీఆర్‌ ఒక టాస్క్‌గా తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. ఇదీ మాకు మిగతా పార్టీలకు ఉన్న తేడా.
కాపీ కొట్టినా పనులు చేయలే..
         రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరిపాలన, దేశంలో మోడీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన ఒకేసారి ప్రారంభమయ్యాయి. మేం 2020 నాటికి మిషన్‌ భగీరథను పూర్తి చేశాం. కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ 2022లో మిషన్‌ భగీరథలో ఇంటింటికి మంచినీరు ఇచ్చినందుకు రాష్ట్రానికి అవార్డు ఇచ్చింది. మన పథకాన్ని 'హర్‌ఘర్‌కో జల్‌' పేరుతో కాపీ కొట్టారు కానీ.. పనులు నేటికీ పూర్తికాలేదు. కేసీఆర్‌ ఇచ్చిన పథకాన్ని తీసుకువస్తే కేంద్రం దీన్ని దేశమంతా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకా రణం. దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవాళ 49శాతం మందికి మాత్రమే అందుతుంది. అమత్‌ కాలమని గొప్పలుచెప్పుకుంటున్నవారు, ఇంకా 51శాతం మంది ప్రజలు కనీస సౌకర్యమైన తాగు నీటికి దూరంగా ఉన్నారని గుర్తించలేకపోతున్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసినా, వాస్తవ వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే. రూ.8,033.66 మిగిలింది.
బీజేపీ సక్సెస్‌ అయింది ఇందులోనే..!
         కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేది. ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్‌ ఉండేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్‌లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి . మోడీ మొదటి బడ్జెట్‌లో చెప్పిన ''థీమ్‌ సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌''. కానీ ఆ ఏడాదంతా మాబ్‌ లించింగ్‌లు జరిగాయి. రెండో బడ్జెట్‌లో నల్లధనాన్ని అరికడుతాం అని చెప్పారు. కానీ మరుసటి సంవ త్సరమే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చేశారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయి. నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని మోడీ చెబితే.. ప్రజలు జన్‌ధన్‌ ఖాతాలు తెరిచి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క పైసా డిపాజిట్‌ కాలేదు. మూడో బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ రైతులను పట్టించు కోకుండా, 2020లో మూడు వ్యవసాయ నల్ల చట్టాల ను తీసుకొచ్చారు. 750 మంది రైతుల ఉసురు పోసుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. అర్హులైన వాందరికి ఇండ్లు అని ప్రకటించారు.. అది అడ్రస్‌ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు. నదుల అనుసంధానం కాలేదు. అంతే కాదు.. బీజేపీ విజయాలు కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
బీజేపీ అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి
అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది
         బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్దాంతం. కానీ బీజేపీ ''పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు'' అన్నచందంగా వ్యవహ రిస్తున్నది. దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు. వారు నిస్సారమైన విమర్శలు చేస్తున్నారు తప్ప.. వారికి నిర్మాణాత్మకమైన ధోరణి లేదు. తాము అప్పులు తగ్గించుకుంటూ వస్తుంటే.. కేంద్రం అప్పులు పెంచుకుంటూ పోతుంది. ఈ రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ ఎంత..? దానిలో ఎంత శాతం ఈ రాష్ట్రం అప్పులు కలిగి ఉన్నది. అది అప్పులను చూసే పద్ధతి. అప్పులు ఇన్ని లక్షల కోట్లు పెంచారని విపక్ష సభ్యులు అంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

02:16 PM

గుజరాత్‌లోని కచ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం!

02:06 PM

రేవంత్ రెడ్డికి టీఎస్‌పీఎస్సీ సిట్ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.