Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీని గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2023

బీజేపీని గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తు

- రాజ్యాంగాన్ని రక్షిద్దాం... దేశాన్ని కాపాడుకుందాం
మోడీ ప్రభుత్వం వల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయి.
ప్రజా ఉద్యమాలపై మోడీ సర్కార్‌ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఫెడరలిజంపై దాడి జరుగుతున్నది.
మోడీ నేతృత్వంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్‌ దోపిడీ కవలపిల్లలుగా అవతరించాయి.
నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీలు ఇస్తున్నది.
- సీతారాం ఏచూరి

- మతోన్మాదం, కార్పొరేట్‌ దోపిడీ మోడీకి కవలలు
- లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజంపై దాడి
- ఈడీ, సీబీఐలకు ప్రతిపక్ష నాయకులే లక్ష్యం
- అదానీ అక్రమాలపై జేపీసీ ఎందుకు వేయడం లేదు
- ప్రత్యామ్నాయ విధానాలతోనే సమస్యలు పరిష్కారం
- అందరం కలుద్దాం, ప్రజాఉద్యమాలను బలపరుద్దాం
- గుడిసెవాసులకు పట్టాలిచ్చేదాకా ఎర్రజెండా పోరు
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- వరంగల్‌లో అట్టహాసంగా జనచైతన్య యాత్ర ప్రారంభం
వరంగల్‌ నుంచి బొల్లె జగదీశ్వర్‌
           కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దెదించితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మతోన్మాదం, కార్పొరేట్‌ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రను శుక్రవారం వరంగల్‌లో ఆయన ప్రారంభించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్‌, మల్లు లక్ష్మిల మెడలో ఎర్రజెండాలు వేసిన ఆయన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ మోడీ పాలనలో రాజ్యాంగ మూలస్థంభాలైన ఆర్థిక స్వావలంబన, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజంపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని చెప్పారు. ప్రజాఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగి స్తున్నదని అన్నారు. మోడీ నేతృత్వంలో మతోన్మాద రాజ కీయాలు, కార్పొరేట్‌ దోపిడీ కవల పిల్లలుగా అవతరిం చాయని విమర్శించారు. కేంద్రా న్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నదని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ఆ ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నదని వివరించారు. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలు దాడులు చేస్తున్నా యనీ, హింసిస్తున్నాయని చెప్పారు. ఆదానీ సంస్థ అక్రమాలు దేశంలోనే పెద్దకుంభ కోణ మన్నారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నా ఎందుకు వేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. పైగా అదానీ తప్పులేదంటూ మోడీ కితా బిస్తున్నారని అన్నారు. గుజరాత్‌లో మోడీకి అదానీ చేసిన సహాయానికి ఇప్పుడు దేశంలోని ఎయిర్‌ పోర్టులు, ఓడరేవులు, జాతీయ రహదారులను కట్టబెడుతున్నారని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీలు కల్పిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలు చేసిన అప్పు రూ.11 లక్షల కోట్లను మాఫీ చేసిందన్నారు. ఈ డబ్బును ప్రజాసంక్షేమానికి విని యోగిస్తే నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు లభించేవని గుర్తు చేశారు. దేశంలో బీజేపీకి వచ్చిన ఓట్లు 37 శాతం, ఇంకా 63 శాతం మంది ప్రజలు ఆ పార్టీకి వ్యతి రేకంగా ఉన్నా రని వివరించారు. గుజరాత్‌లో బీజేపీ గెలి చినా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిందన్నారు. త్రిపురలో పది మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర కల్పించాలంటూ నాసిక్‌ నుంచి ముంబయి వరకు కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ సాగు తున్నదని చెప్పారు. ఉల్లి రైతాంగానికి కిలోకు రూ.రెండు అందుతుంటే, వినియో గదారులకు రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతు న్నారని అన్నారు. ఒకవైపు రైతు లు, ఇంకోవైపు ప్రజలు మోసపోతున్నారని వివరిం చారు. మోడీ ప్రభుత ా్వన్ని అధికారం నుంచి గద్దెదించితే ప్రత్యామ్నాయ విధా నాలను అమలు చేయొచ్చని చెప్పారు. అందరం కలిసి ప్రజా ఉద్యమాలను బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
           ఈ జనచైతన్య యాత్ర విజయ వంతం కావాలని ఆకాంక్షించారు. గుడిసె వాసుల భూములను క్రమబద్ధీ కరించి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎర్రజెండా ఎప్పటికీ పేదల ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు ఉద్యమాలు చేస్తే, తాము ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
భూపోరాటాలను ఉధృతం చేస్తాం : జి నాగయ్య
           రాష్ట్రంలో భూపో రాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య చెప్పారు. జక్కలొద్దిలో 250 ఎకరాల వరకు మాజీ ఎమ్మెల్యేలు ఆక్రమించారని విమర్శించారు. వాటిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కానీ పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించడం ఎంత వరకు సమంజసమని అడిగారు. గుడిసెవాసులకు పట్టాలిచ్చే వరకు ఎర్రజెండా వారికి అండగా పోరాడుతుందన్నారు.
1,100 కిలోమీటర్ల మేర యాత్ర : పోతినేని
           జనచైతన్య యాత్ర 1100కిలోమీటర్లపాటు సాగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల బహిరంగ సభలను నిర్వహిస్తామని వివరించారు. వీరోచిత సాయుధ రైతాంగ పోరాటం సాగిన పోరుగల్లు నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి : మల్లులక్ష్మి
           మోడీ హయాంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి చెప్పారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మహిళలు హక్కుల కోసం ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి రంగన్న అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీరాం నాయక్‌, జగదీశ్‌, నాయకులు వంగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని అడుగుపెట్టనివ్వం : చెరుపల్లి
           రాష్ట్రంలో బీజేపీని అడుగుపెట్టని వ్వబోమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. బీజేపీని వ్యతిరేకిస్తున్నందువల్లే బీఆర్‌ఎస్‌ ను సమర్థిస్తున్నామని అన్నారు. ఇంకా గట్టిగా కొట్లాడాలన్నారు. అం దరం కలిసి బీజేపీని నిలువరిం చాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలను ప్రశ్నించేందుకే ఈ యాత్ర : జూలకంటి
           ప్రజలకు అనేక వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిన ప్రభుత్వా లను ప్రశ్నించడం కోసమే ఈ యాత్ర చేపడు తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. కేంద్రం విధానాల మీద యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులూ కలిసి పోరాడాలి : తమ్మినేని
           అన్ని పార్టీల్లాగా బీజేపీ సాధారణ పార్టీ కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌ మనువాద భావజాలం దేశానికే ప్రమాదకరమని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కులవ్యవస్థ ఉండాలనీ, కింది కులాల వారు చదువుకోవద్దనీ, ఆడవారికి స్వతంత్రత ఉండొద్దని మనువాదం చెప్తుందన్నారు. కేసీఆర్‌, కవిత తప్పు చేస్తే విచారణ చేయొచ్చని అన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా చేసుకుని విచారణ చేయడం సరైంది కాదన్నారు. అదానీ రూ.17 లక్షల కోట్ల కుంభకోణం చేశారని చెప్పారు. బీజేపీతో అంటకాగుతూ ఎన్ని కోట్లు కుంభకోణం చేసినా వదిలేస్తారా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి మందికి ఇండ్ల స్థలాలు ఇస్తామనీ, గృహలక్ష్మి కింద రూ.మూడు లక్షలిస్తామనీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయినంత మాత్రాన గుడిసెలు పీకేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పేదలకు రక్షణగా ఎర్రజెండా పోరాడుతుందన్నారు. జక్కలొద్దిలో మాజీ ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 29న హైదరాబాద్‌కు రావాలనీ, సీఎం కేసీఆర్‌కు ఇండ్ల స్థలాలివ్వాలంటూ పిటిషన్‌ ఇద్దామంటూ పేదలకు విజ్ఞప్తి చేశారు.
కలిసే ముందుకు : కూనంనేని
           ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు ఐక్యంగా చేసి, ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసే పరిస్థితి ఇకనుంచి ఉండబోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పనిచేయడం రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో శుభపరిణామమని అన్నారు. చావైనా, బతుకైనా కలిసే ముందుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని ఖాళీ చేయిస్తే ఎర్రజెండా ప్రజలకు అండగా పోరాడుతుందని తెలిపారు. ఒకవేళ అక్కడ పేదలు గుడిసెలు వేసుకోకపోతే అభూమి భూకబ్జాదారుల పాలయ్యేదని చెప్పారు. దాన్ని రక్షించిన పేదలకే ఆ భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనచైతన్య యాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈనెల 25 నుంచి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీల అమలుకు యాత్ర చేస్తున్నామనీ, సీపీఐ(ఎం)ను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.