Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీల తొలి గ్రామంగా ఇబ్రాహీంపూర్ నమోదు అయింది. ఈ గ్రామానికి చెందిన ముత్తవ్వ తన డెబిట్ కార్డు ఉపయోగించుకొని రేషన్ షాపులో 12 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేశారు.. మంత్రి హరీశ్‌రావు సోమవారం సాయంత్రం ముత్తవ్వ సహా అయిదుగురికి బియ్యం, చెక్కర వంటి నిత్యావసర సరుకులు స్వయంగా తూకం వేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకరరెడ్డి, ఎంఎల్‌ఏ బాబూ మొహన్, కాన్సర్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ రఘురాం, గ్రామ సర్పంచ్ కె.ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపూర్‌ను మంత్రి హరీష్ దత్తత తీసుకున్నారు. గ్రామ జనాభా దాదాపు 1200మంది. ఈ గ్రామంలో ప్రజలందరికీ ఎకౌంట్లు తెరవడం, డెబిట్ కార్డులు, స్వైపింగ్ మెషీన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. నగదు రహిత లావాదేవీలకు ఈ గ్రామం అందరికీ ఆదర్శం కానున్నట్టు మంత్రి తెలిపారు.