Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సైన్సు పరిశోధనలో విలువలేవి? | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Aug 18,2021

సైన్సు పరిశోధనలో విలువలేవి?

ఏ రంగంలోనైనా నైతిక విలువలు అవసరం. నైతిక సూత్రాల ఆధారంగా మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటారు గౌతమ బుద్ధుడు.ఆధునిక కాలంలో ఈ నైతికత అనేది అన్ని రంగాల్లో తగ్గుతుంది. అందుకు శాస్త్ర సాంకేతిక రంగం కూడా మినహాయింపేమి కాదు. విజ్ఞానం నిరంతరం వికసిస్తూ మానవాళి ఎదుర్కొనే అనేక సమస్యలని పరిష్కరిస్తుంది. పర్యావరణ కాలుష్య ఫలితంగా మనం అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్‌ తెచ్చిన ముప్పు ఇటువంటిదే. మనం పెంచుకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని ఆయుధాలు, యుద్ద రాకెట్స్‌ తయారీకి ఉపయోగిస్తే సామాన్యుడు ఎదుర్కొనే సమస్యలకి సైన్సు పరిష్కారం చూపించలేదు. మధ్య యుగాల్లో మత గురువులు రాజులని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా, ఆధునిక కాలంలో సైన్స్‌ పరిశోధనలని కార్పొరేట్‌ వర్గాలు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.
     ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు కరోనా నియంత్రణకి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవాలి. కోవిడ్‌ టీకాలపై మేధో సంపత్తి హక్కులని తాత్కాలికంగా ప్రపంచ దేశాలు రద్దు చేసుకోవాలి.అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలలో టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలు లభిస్తాయి. వివిధ దేశాధినేతలు చర్చల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి.
    టీకాలపై పేటెంట్‌ హక్కులని రద్దు చేసుకుంటే సులభంగా టీకాకి చెందిన పరిజ్ఞానాన్ని వివిధ దేశాల మార్చుకోవచ్చు. తద్వారా టీకాల ధరలు తగ్గుతాయి. పేద దేశాల ప్రజలకి త్వరగా టీకాలు అందుతాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ల వల్ల వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం వేగవంతంగా మార్చుకోవాలి. ప్రతి ఆవిష్కరణలో మానవుని సమిష్టి కృషి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడి దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఫలితంగా పేద దేశాలు దోపిడీకి గురౌతాయి.
    ప్రపంచానికి ఆణుబాంబులు, మారణ ఆయుధాలు కాదు కావాల్సింది. మహమ్మారులని ఎదుర్కొనే సామర్ధ్యం కావాలి. ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ ఇలా అంటారు.. ''సైన్స్‌ని మానవ వికాసానికి ఉపయోగించాలే తప్ప, మానవ వినాశనానికి కాదు''. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ కూడా తన ఆస్తిని మానవ ప్రగతికి దోహదపడే పరిశోధనలు చేసే వారికి పురస్కారాలని ఇచ్చేందుకు వీలుగా వీలునామా రాశారు. సైన్స్‌ వాదులు ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు పెంచడం. ఇందుకు పెద్ద ఎత్తున సైన్సు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. రెండు సైన్స్‌ పరిశోధన ఫలాలు సామాన్యులకు అందేటట్లు చూడాలి. అందుకు బలమైన సైన్స్‌ ఉద్యమాలు అవసరం అవుతాయి. అయితే సైన్స్‌ ఉద్యమాలు విజయవంతం అవ్వాలంటే మానవ వనరులు పుష్కలంగా లభించాలి. మనదేశంలో నూటికి 95శాతం మంది సైన్స్‌ చదువుతున్నారు. చాలా ప్రయివేటు కళాశాలల్లో ఆర్ట్స్‌ కోర్సులు కూడా లేవు. మరెందుకు మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి?
    నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి సత్వర పరిష్కారం లభించడం లేదు. విద్య, వైద్యం ప్రజలకు పెనుభారంగా మారాయి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే సకాలంలో ఎవరిని సంప్రదించాలనే విషయం ఇప్పటికీ పేదవారికి కొరుకుడు పడని విషయమే. దానికి వారు తమకు తోచిన మార్గం ఎంచుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే వారు మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారు. ఇదొక సామాజిక సమస్య. ఇటువంటి వారిని అవహేళన చేయడం ద్వారా వారి సమస్యలని పరిష్కరించలేం. వారి పట్ల సానుభూతిని ప్రదర్శించాలి. ఇందుకుగాను విభిన్న ఆలోచనలున్న వ్యక్తులతో సైన్సు వాదులు పనిచేయాలి. సైన్సు పరిశోధనల్లో విలువలు అవసరం.సైన్స్‌ సాధనాలని కూడా వ్యాపార ధోరణిలో కాకుండా, సమస్యలని పరిష్కరించడానికి వినియోగించాలి. సామ్రాజ్య వాదాన్ని నమ్ముకొని బయోవార్స్‌కి తలుపులు తెరిచి ఉంచకూడదు. మతం మనుషుల సమస్యలు తీర్చదని సైన్స్‌ వాదులు ప్రచారం చేస్తుంటారు. సైన్స్‌ పరిశోధనలు కూడా సామాన్యులకు ఉపయోగపడకపోతే, మధ్య యుగాల్లో మతం సృష్టించిన విధ్వంసాన్ని, ఆధునిక కాలంలో మనం అభివృద్ధి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆ పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకున్న ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని రక్షించలేం. గెలిలియో, బ్రూనో, జెన్నర్‌ వంటి శాస్త్ర వేత్తలు ఎంతో త్యాగం చేసి ప్రపంచాన్ని ముందుకు నడిపించారు. వారిని నేటి పాలకులు స్పూర్తిగా తీసుకోవాలి.
- ఎం. రాంప్రదీప్‌
సెల్‌: 9492712836

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట
దూల తీరుతోంది...
దొంగడబ్బు ! మంచి డబ్బు!
ఆయుధాలు లేని ప్రపంచాన్ని కాంక్షిద్దాం..!
'శ్రమదోపిడీ'తో సంపాదించేదంతా 'నల్లడబ్బే'!
ప్రభుత్వరంగమే దేశానికి రక్ష..
'నల్ల డబ్బు' అంటే?
సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం...
పర్యావరణ పరిరక్షణే సురక్షితం
డబ్బు! నల్ల డబ్బు! దొంగ డబ్బు! మంచి డబ్బు!
'భిన్నత్వంలో ఏకత్వం' నినాదానికే పరిమితమా!
మూఢనమ్మకాలతో హత్యలు...

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.