Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Sep 08,2021

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

జీవితంలో అనేక సమస్యల వలన మనిషి ఎంత ఒత్తిడికి గురవుతున్నాడో అందరికీ తెలిసిందే. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య, వైవాహిక, ప్రేమ విషయాలు, చదువుల, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ అభద్రత, నిరుద్యోగ సమస్య ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మనిషి తప్పక మానసికంగా కృంగిపోవటం, నిరాశ, నిస్ఫ్రుహలకు లోనుకావటం సహజమే. వీటికి తోడు గత రెండేళ్లనుండి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌ మహమ్మారి దుష్ప్రభావాల వలన సామాన్యుల జీవితం మరింత దుర్లభం అవటం గమనిస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులలో ఏదో రీతిగా తమకూ వైరస్‌ సోకుతుందా? సోకితే కోలుకోగలమా? వైద్య ఖర్చు భరించగలమా? అందరి భవిష్యత్‌ ఏమై పోతుందో? అన్న మనోవ్యధతో కృంగిపోయి కూడా నిస్సహాయ స్థితిలో క్షణికావేశంలో ఆత్మహత్య ఆలోచనలకు లోనుకావడం జరుగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 8లక్షల మంది అన్యాయంగా ఆత్మహత్యలకు బలవుతున్నారు. వీటిని అరికట్టడానికి, ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని, ఓదార్పును అందించి వారి బాధను పంచుకుంటూ వారి భవిష్యత్‌పైన ఆశను తిరిగి చిగురింప చేసి ఆత్మహత్య ఆలోచన నుంచి మరల్చి బతుకుపై ఆశను నింపేందుకు కృషి చేయాలి. ఇదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 10 రోజును ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిపై ప్రజలలో చైతన్యాన్ని కలిగించే పని 'రోష్ని' ఎన్‌జీఓ నిర్వహిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల వివరాలు:
- డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం ప్రపంచంలో ఏటా 8 లక్షలమంది ఆత్మహత్యలకు బలవుతున్నారు.
- ప్రతి 40 సెకన్లకు ఒకరు ఈ రకంగా చనిపోతున్నారు.
- ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఎక్కువగా 15 సం. నుండి 29 సం. మధ్య వయస్కులే. వీరిలో పురుషులే అధికం.
- మన దేశంలో 2019 సంవత్సరంలో 1,39,123 మంది ఆత్మహత్యలకు బలైనారు. దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, అలాగే రోజుకు 381 ఆత్మహత్యలు నమోదు కావడం కూడా విచారించతగిన విషయం.
- మన దేశంలో రాష్ట్రాల వారీగా ఆత్మహత్యల వివరాలు
మహారాష్ట్ర:13.6 శాతం, తమిళనాడు: 9.7శాతం, బెంగాల్‌ : 9.1శాతం, మధ్యప్రదేశ్‌: 9శాతం, కర్నాటక : 8.5శాతం, తెలుగు రాష్ట్రాలలో: 5.5 శాతం. 'రోష్ని' హెల్‌లైన్‌కిి రోజూ సుమారు 40 నుండి 50 కాల్స్‌ ఆత్మహత్య చేసుకోవాలని ఉందని ఫోన్‌ చేస్తుంటారు.
ఆత్మహత్యలను ప్రేరేపించే ముఖ్య కారణాలు:
ఆత్మహత్యా భావనకు ప్రధానమైనది మానసిక ఒత్తిడే. ఒంటరితనం, కుటుంబ సమస్యలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వైఫల్యాలు, లైంగిక వేధింపులు, చదువులు, పరీక్షలు, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, అభద్రతా భావం, అనారోగ్యం, వద్ధాప్యం కారణాలవల్ల తీవ్ర ఒత్తిడికి లోనయి నిస్సహాయతలో బలహీన క్షణాలలో విలువైన ప్రాణాలను బలిచేసుకుంటున్నారు.
ఆత్మ హత్య చేసుకోవాలనుకునే వారిని క్రింది లక్షణాలతో గుర్తించ వచ్చు.
ఆకలి, నిద్ర సన్నగిల్లటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, ఎప్పుడూ ఒంటరిగా ఒత్తిడిలో ఉండటం, తమ బాధ్యతలను ఇతరులకు అప్ప చెప్పటం, ఏదో కోల్పోయినట్లు, దిగులుగా, అలసటగా, బలహీనంగా, నీరసంగా ఉండటం, కొత్తగా డైరీ రాయటం, శరీరానికి హాని కలిగించే వస్తువులను (నిద్రమాత్రలు, కత్తి, పాయిజన్‌ లాంటివి) సమకూర్చుకోవడం, రోజూ చేసే పనుల్లో తరచుగా తప్పులు చేయడం, అన్నిటిపై ఆసక్తి తగ్గి నిరాశ, నిస్పృహలో ఉంటూ సమస్యలు నాతోనే సమసిపోతాయి అనటం, ప్రతి చిన్నవిషయానికీ విషయాన్ని పెద్దగా ఊహించుకుని తల్లడిల్లడం, తమ ఇష్టమైన వస్తువులను నచ్చినవారికి ఇవ్వటం వంటి లక్షణాలున్న వారిని వారి దగ్గరి కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులు లేదా వారే స్వయంగా గుర్తించి అప్రమత్తం కావాలి.
వారి సమస్యలను, ఆలోచనలను శ్రద్ధగా విని అర్థంచేసుకోవటం ముఖ్యమైన విషయం. వారికి తోడుగా ఉన్నామని భరోసానూ, ఓదార్పునిస్తూ మానసిక ఆసరాగా ఉంటామని నమ్మకం కలిగించాలి. వారికి మనోధైర్యాన్ని కలిగించి తిరిగి జీవితం మీద ఆసక్తిని కలిగించగలగాలి, అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. ఆత్మహత్యా ఆలోచనలతో బాధపడే వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఒంటరిగా ఉంచకూడదు. వారు ఇష్టపడే వ్యక్తులను కలిసేలా, మాట్లాడేలా ప్రోత్సహించాలి. వారి బాధను పంచుకుని వారి మనసును తేలిక పరిచేలా చేసి సాధారణ స్థితిలోకి రప్పించే ప్రయత్నం చేయాలి.
''ఆత్మహత్యా ప్రయత్నం ఇష్టపడి చేసే పని కాదు!
అది ఒక సహాయం కోసం చేసే ఆక్రందన అని గుర్తించాలి!!'' అందరం కలిసి ఆత్మహత్యలులేని అందమైన సమాజాన్ని నిర్మించుదామని ఈ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం రోజున (సెప్టెంబర్‌ 10) ప్రతిన పూనుదాం!
శ్రీమతి ఆనంద దివాకర్‌
సెల్‌:9391018972

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట
దూల తీరుతోంది...
దొంగడబ్బు ! మంచి డబ్బు!
ఆయుధాలు లేని ప్రపంచాన్ని కాంక్షిద్దాం..!
'శ్రమదోపిడీ'తో సంపాదించేదంతా 'నల్లడబ్బే'!
ప్రభుత్వరంగమే దేశానికి రక్ష..
'నల్ల డబ్బు' అంటే?
సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం...
పర్యావరణ పరిరక్షణే సురక్షితం
డబ్బు! నల్ల డబ్బు! దొంగ డబ్బు! మంచి డబ్బు!

తాజా వార్తలు

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

09:18 AM

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

09:17 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.