Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కుండ బద్ధలు కొట్టే సంప్రదాయం! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Dec 23,2021

కుండ బద్ధలు కొట్టే సంప్రదాయం!

(గత వారం తరువాయి)
కోట్లూ, స్వెట్టర్లూ పుట్టి తయారై పోయాయి అంటే, వాటితో అవసరాలూ, అర్ధాలూ వుంటాయి. కానీ మెడ లోనించి గుండెల మీదకి వేళ్ళాడే గుడ్డల మడతలకి అర్ధం ఏమిటి? శరీరానికి ఏ ఉపయోగాన్నీ ఇవ్వని ఒక మడతని 'ఫేషన్‌'గా ధరించడమేనా? - అంటే నా మాటని ఎవరో ఒక గొప్ప మానవుడు ఒప్పుకున్నాడు. 'అవును. ఇది చాలా తగ్గుతోంది ఇప్పుడు. ఐటీ కంపెనీల్లో సీఈవోలు కూడా టైలు వేసుకోరు ఇప్పుడు, పెద్ద గొప్ప మీటింగులకి తప్ప!' అన్నాడు.
  ఏడ్చినట్టుంది. ఇదా తగ్గడం? దాన్ని కట్టుకునే టప్పుడు, 'ఇది ఎందుకు?' అనిపించదా కట్టుకునే మొగ మానవులికి?
   ఆ గొప్ప మానవుడు 'ఇప్పుడే గూగుల్‌ వెదికాను. ఆడవాళ్ళు టైలు వేసుకున్న ఫొటోలు కూడా కనబడ్డాయండీ! ఒక సారి చూడండి' అన్నాడు.
  ఏమిటి చూసేది ఆ చెత్తని? చెత్త కాదు, చెత్త ఎరువవుతుంది. టైలు కూడా ఎరువవుతాయా?
  ప్రపంచంలో వున్న ఏ దేశపు మంచి సంస్కృతిని అయినా ఇతర దేశాలన్నీ నేర్చుకోవచ్చు గానీ, మంచి సంస్కృతి అనేనా ప్రతీ ఫ్యాషన్‌ కీ, పెట్టుబడిదారీ సంస్కృతిని నేర్చుకుంటున్నాయి ప్రపంచ దేశాలు?
   చలి దేశాల 'భోజనాల బల్ల' సంస్కృతి, ఈ దేశానికి కూడా నిజంగా అద్భుతం! పరి శుభ్రమైన, ఆరోగ్యమైన అలవాటు అది. మోకాళ్ళ నొప్పులూ అవీ వుండవు. అలాగే, ఇంకేదైనా 'మంచిది' దొరికితే, అదీ నేర్చుకోవచ్చు. నేర్చుకుని తీరాలి. మళ్ళీ మళ్ళీ నేర్చుకోవచ్చు.
   మొన్న నేను పార్లమెంటుని ఫోన్లో, అనుకోకుండా అది వచ్చేస్తే చూశా. ఆ రోజు అక్కడ, పార్లమెంటు బైట ప్రధాని మోడీ మాట్లాడ బోతుండగా చూశా! మాట్లాడబోయే ముందు నోటికి అడ్డంగా వున్న ఆ మాస్క్‌ని తీసేసి, మొహానికీ గడ్డానికీ వున్న చెమటనంతా చేత్తో మొహాన్నంతా తడుముతూ తుడుచు కోవడం అందరూ చూసే వుంటారు! చేతిలో రుమాలు లేదు! లేదండీ! 'ప్రధాని తనం'లో అయినా, చెమటని తుడుచు కోవడం, శుభ్రం అవడం, ఎలా చేయాలో తెలీక పోతే మరి 'పరి పాలన' తెలుస్తుందా? చెమట నంతా చేతుల్తోనేనా? మరి చేతుల్నేం చేస్తారు? నిరు పేదలు చేస్తారు ఆ విధంగా. వారికి అది తప్పని సరే. కానీ, ప్రధానికి కూడా అదే తప్పని సరి అవుతుందా? ఏమో బాబూ! వింత దృశ్యం చూశాను. 'ప్రధాని' ఎలా వున్నా, ఆయన పదవీ, ఆ కుర్చీ, ఆయన కీర్తిని తగ్గించవు. కానీ, ఏ ప్రధానులూ కాకుండా, చిన్న చిన్న వుద్యోగాలతో బ్రతికే టీవీ ఛానల్స్‌లో యాంకర్లుగా పనిచేసే మేధో కార్మికులు, శుభ్రతని లక్ష్య పెట్టక్కర లేదా? పాలించే వర్గ భావాలే ప్రజల భావాలు - అని చదివాం కదా? ప్రధానే రుమాలుతో తుడుచు కోకపోతే, టీవీ ఉద్యోగులు రుమాళ్ళని లెక్క చేస్తారా? వీరిలో ఇద్దరు ముగ్గురైతే, నా లెక్క మాత్రమే ఇది. మెళ్ళల్లో నెక్‌టై పాముల్ని వేళ్ళాడేసుకుని కనపడతారు. మంచి డిబేట్లే నడుపుతారు. 'టై వుంటేనేం పని బాగానే చేస్తున్నారుగా?' అంటారా? 'పని' అంటే ఉద్యోగం. టై యేమో, ఏ ఉపయోగమూ లేని నిరర్ధక సంస్కృతి. టీవీ డిబేట్లని వదిలి పెట్టకుండా వినాలనే వుంటుంది నాకు. టైల ఫేషన్ల వల్ల, నాలో చెడ్డ ఫలితం లేదన్న మాట! - అని నాకే అనుమానం. చర్చల్ని వినాలంటే, ఆ ఫోన్‌ని దూరంగా పెట్టి వినొచ్చు గానీ, చర్చల వారిని ఎంత సంస్కారంగా వున్నారో చూడాలని కూడా వుంటుంది కదా? ఎలా చూస్తాను? అప్పటికే చూసేశాను, ఆ పాముని! మళ్ళీ, రెండో సారి కూడా చూస్తానా? చూస్తే, 2, 3, రోజులు అన్నం తినలేను. ఆ మర్నాడు కాఫీలతో, తప్పని సరై, సరి పెడతాను. ఆ జీవి అంటే, నాకు భయం కాదు. బాగా అసహ్యం. అది 'తప్పు' అని తెలుసు. అయినా అంతే.
   ఇంకో అనుమానం. టైని చూస్తే, నీకు వ్యతిరేకం గానీ, టైలు పెట్టుకునే వాళ్ళకి వ్యతిరేకత లేకపోతే, వాటిని ధరించడం తప్పా?' - అంటారు, వాళ్ళూ వీళ్ళూ. అయ్యో, ఉపయోగం లేని వేషం తప్పు కాదా?- అంటాను నేను. 'ఆనందం కలిగితే, అది ఉపయోగం కాదా?' అంటారు. అది 'తప్పుల వల్ల వచ్చే ఆనందం అని నా వాదం.
   మొన్న, కుండ బద్దలు సుబ్బారావు గార్ని కూడా రుమాలు లేకుండా మొహం తుడుచుకోడం చూశాను. ఈయన ఫోనుల్లో, నాకు బాగా పరిచయం వున్న వ్యక్తే! విమర్శిద్దామా - అనుకున్నాను గానీ, ఆయన దొరకడు. ఆయనకి ఆరోగ్య సమస్య వల్ల ఇంట్లో వుంటే విశ్రాంతి కావాలి. అది కాకపోతే, టీవీ చర్చల్లో బిజీ అవుతారు. 'రుమాళ్ళు మానెయ్య వచ్చునా, లేదా? నెక్‌ టైలు వాడవచ్చునా లేదా?' అనే చర్చలు టీవీ ఛానళ్ళలో పెట్టమని, వారిని అడిగి, అప్పుడు మీరు రుమాళ్ళు పెట్లో వుంటే, వాటిని లాగి అవతల పారెయ్యండి!' - అని ఆయనతో చెప్పాలని ప్రయత్నిం చాను గానీ, అది సాగలేదు, ఆయన దొరక్క. అందుకని అలా పర్శనల్‌గా అడిగేదాన్ని, ఇలా పబ్లిక్‌లో అడుగుతున్నారా? ఆయన పరువు పోదా - అంటారేమో జనాలు. ఆయన అలా అనుకోడని నమ్మకం. జనాలు ఏం అనుకున్నా ఫర్వాలేదనీ నా ధీమా!
   ఈ కుండ బద్దలాయన ఒక్కో రోజున 5, 6 వీడియోస్‌లో కూడా మాట్లాడి 5, 6 కుండలు బద్దలు గొడుతూ వుంటారు!
   ఒక సారి మొదటే అడిగాను, 'కుండని బద్దలు గొడితే ఏం గొప్పండీ? కుండ వుంటే చల్లటి నీళ్ళు కదా?' అంటే, సుబ్బారావు గారు 'ఏమో, అది సంప్రదాయం' అన్నారు గానీ, అంత కన్నా చెప్పలేక పోయారు. ఇది రుమాళ్ళ, టైల వ్యాసానికి అనవసరమే గానీ, కుండ బద్దలుని కూడా నేను సహించలేక, దీన్ని టైలతో జత చేస్తూ పోతాను.
   కుండ బద్దలు సంప్రదాయం ఏమిటో చూడాలని, ఒక పంతులు గార్ని పట్టుకుని అడిగితే, ఆయన ఆ సంప్రదాయం ఏమిటో తనకు తెలిసినది వివరం గానే చెప్పారు. 'మనిషి మరణిస్తే ఆ దేహానికి అంత్య క్రియలు చేస్తూ, స్మశానంలో ఆ దేహానికి అగ్నిని అంటించే ముందు, అంత వరకూ ఒక వ్యక్తి కొడుకో, సోదరుడో తన భుజం మీద మోస్తూ వున్న నీళ్ళ కుండని విసురుగా నేల మీదకి వెనక్కి తోసేస్తే అది భళ్ళున బద్దలవుతుందట! అంటే, మనిషికి ముగింపు జరిగింది - అనే దాన్ని కుండకి ముగింపు జరిపి, దాన్ని ఒక పోలికగా చెప్పడం' - అట. అలా చెయ్యడం వల్ల, ఆ మనిషితో సంబంధీకులకు వున్న భవ బంధాలన్నీ తెగిపోయాయి - అని స్పష్టంగా ప్రకటించడం అట! కుండ భళ్ళున బద్దలవడం తో!
   'అయ్యయ్యో! ఇదేం పోలికండీ? మనిషికి ముగింపు సహజంగా జరుగుతుంది. కుండ దానికై అదే లేచి, కింద పడితే అప్పుడు కూడా అది పోలిక అవదు. కుండ అలా ఎలాగా చెయ్యదు. కుండని మనం బద్దలు గొడితే అది మనిషి ముగింపు లాంటిది అవుతుందా? అసలు ఎవరైనా కుండని అలా బద్దలు గొట్టడం మీ రెప్పుడైనా చూశారా?' అని పంతులు గార్ని అడిగితే, ఆయన వెంటనే చెప్పారు. 'ఆర్నెల్ల కిందట మా అమ్మ పోయినప్పుడు అమ్మ దగ్గిర అగ్ని సంస్కారం జరిగే ముందే కుండని నేను భళ్ళున బద్దలు కొట్టాకే మా అమ్మ దేహానికి అగ్ని ముట్టించాను. సినిమాల్లో ఇవన్నీ చూపిస్తూనే వుంటారు. నా భుజం మీద వున్న నీళ్ళ కుండని నేనే నేల మీదకి కొట్టాను' అన్నారు మళ్ళీ మళ్ళీ.
   'ఇదేం సంప్రదాయం?' అనుకున్నాను గానీ, నేనేమీ మాట్లాడ లేదు. ఇటువంటి సంప్రదాయాలు నాకు నచ్చవని ఆయనకి తెలుసు.
   వెనకటి మానవులు ఎలాగో ఆలోచించారు. అందరూ కాదేమో! ఒక్క హిందూ మతస్తులే నేమో! అందులోనూ అందరూ కాదు కదా? దానినే మనం ఈనాడు కూడా అనుసరిస్తే, కుండలు పోతాయని కాదు. అసలు, తర్క బద్దంగా ఆలోచించు కోవలిసిన మానవులు, వందల, వేల సంవత్సరాల నాటి తప్పు అలవాట్లనే నిలబెట్టుకుంటే ఎలాగ? ఈ సంప్రదాయమే కాదు. ఎన్నెన్నో పాత తప్పులు వుంటూనే వున్నాయి. వాటిని వదులుకుంటూ వున్నాము కదా?
   'రుమాళ్ళు వాడరు! నెక్‌ టైలు వదలరు' అనేవి నాకు రెండు సందేహాలు. వీటిని వదిలించు కోలేమా? వాటిని ఎందుకు చేస్తారో, నాకు తెలియకే, అలా చేసే వారి జవాబులు విని, తెలుసు కోవాలనే అడుగు తున్నాను సుమా! మంచి జవాబులు దొరికితే, నన్నీ సందేహాలు పీడించకుండా వొదులుతాయి కదా? మంచి జవాబులు ఇచ్చి, నా సందేహాల్ని పోగొట్టలేరా ఎవ్వరూ? దాపరికం లేకుండానే అడిగాను కదా? నా మనసులో మాటే అడిగాను మరి.
(సమాప్తం)
- రంగనాయకమ్మ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట
దూల తీరుతోంది...
దొంగడబ్బు ! మంచి డబ్బు!
ఆయుధాలు లేని ప్రపంచాన్ని కాంక్షిద్దాం..!
'శ్రమదోపిడీ'తో సంపాదించేదంతా 'నల్లడబ్బే'!
ప్రభుత్వరంగమే దేశానికి రక్ష..
'నల్ల డబ్బు' అంటే?
సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం...
పర్యావరణ పరిరక్షణే సురక్షితం
డబ్బు! నల్ల డబ్బు! దొంగ డబ్బు! మంచి డబ్బు!

తాజా వార్తలు

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

09:18 AM

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

09:17 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.