Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉన్నట్టా..! లేనట్టా...? | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 05,2022

ఉన్నట్టా..! లేనట్టా...?

''అసలు పోయింది కొసరు పోయింది'' అన్న సామెత ప్రస్తుత తెలంగాణ సమాజానికి సరిగ్గా అబ్బుతది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉధృతంగా సాగిన ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించింది తెలంగాణ విద్యార్థి లోకం, యువతనే. రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు దక్కి మా బతుకులు బాగుపడతాయని ఉద్యమించిన విద్యార్థులకు, యువతకు వర్తమానంలో మొండి చెయ్యే కళ్ళకు కనిపించేసరికి పూర్తి నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయింది. విద్యార్థులు, యువతే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నది ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం. వీరు కూడా మెరుగైన సదుపాయాలు కొత్తరాష్ట్రంలో పొందవచ్చు అనే ఆశతోనే చేశారు. కానీ ఉద్యమ సంస్థగా ఉండి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలేమో కానీ ఉన్న ఉద్యోగాలను ఊడబీకే పని పెట్టుకున్నది. అందుకు ఉదాహరణ వీఆర్వో వ్యవస్థ. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడే సుమారు 7000గా ఉన్నటువంటి పోస్టులలో దాదాపు 5500ఉద్యోగులు మాత్రమే ఉండి కొందరు వీఆర్వోలు రెండు, మూడు గ్రామాల బాధ్యతలు కూడా నిర్వర్తించారు. రెవెన్యూ వ్యవస్థలలో వీఆర్వోలే చాలా కీలకంగా పనిచేశారు. పై స్థాయి అధికారులకు ప్రజలకు మధ్య వారధిలా ఉండేవారు. అయితే అన్ని శాఖలలో ఉన్నట్లుగానే రెవెన్యూలో కూడా అవినీతి మకిలి ఉంది. దాన్ని తొలగించవల్సిందే. అందులో సందేహం లేదు. కానీ ఆ అవినీతి కారణంతో మొత్తంగా వ్యవస్థనే రద్దు పరిచి ఏడాది గడిచిపోయింది. వారిని వివిధ శాఖలలో సర్దుబాటు చేస్తాం అన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తట్లేదు. ఇప్పుడు ఆ తొలగించబడ్డ ఉద్యోగులకు ఏ పేరు మీద జీతాలు ఇస్తున్నట్టు? అసలు వారు ఉన్నట్టా! లేనట్టా? ఇక పోతే ఆ తొలగించబడ్డ ఉద్యోగులను అదే రెవెన్యూ వ్యవస్థలో పనులు చేయించు కుంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలవద్ద గుమస్తాగానో, వారి కార్యాలయాలలో కాగితాలు సర్దటానికో వినియోగిస్తున్నారు. ఇటీవల కొన్ని పత్రికలలో వీఆర్వోలు మూటలు మోస్తున్న కథనాలు కూడా ప్రచురితం అయినవి. ఇలా నిన్నటిదాకా అధికారులుగా ఉన్న ఉద్యోగులను అటెండర్‌ స్థాయికి దిగజార్చిన ఘనత మాత్రం మన తెలంగాణ ప్రభుత్వానిదే. ఆ అటెండరయినా ఒక పేరు, హౌదా, గుర్తింపుతో పనులు చేస్తారు. కానీ వీఆర్వోలకు అది కూడా లేదు. మరీ కాదనుకుంటే కొంతమంది వీఆర్వోలు ఊరికే ఉదయం వచ్చి సంతకాలు చేసి సాయంత్రం దాకా ఉండి పోతున్నారు. అయినా వారికి జీతాలు చెల్లిస్తున్నారు. వారితో ఎటువంటి విధులు చేయించకుండా ఎవరి సొమ్మని అంతటి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పినట్టు వీఆర్వోలు అవినీతికి పాటు పడితే ఆ అవినీతిని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని వారిపై నిరంతర నిఘా, పర్యవేక్షణ చెయ్యడం ప్రభుత్వానికి పెద్దగా కష్టమైన పనేం కాదు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకుండా ఆ వ్యవస్థను రద్దు పరిచి ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టింది. నిజానికి మనం కుల్లా కుల్లా మాట్లాడుకుంటే ప్రతీ శాఖలో అవినీతి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు రిజిస్ట్రేషన్‌శాఖలో ఆఫీసుల ముందు అనధికార వ్యక్తుల దుకాణంలో అధికారిక కార్యక్రమాలు యధేచ్చగా జరుగుతాయి. ఆ దుకాణాల వ్యక్తులతో పోకుంటే మన పనులు ఎంత కష్టమవుతాయో రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకి వెళ్లిన అనుభవం ఉన్నవారిని ఎవరిని అడిగినా చెపుతారు. అక్కడ ఎంత దోపుకం జరుగుతుందో సులభంగా గ్రహించవచ్చు. మరి ఆ కారణం చెప్పి రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను తొలగిస్తుందా? అంటే తొలగించదు. ఎందుకంటే దాని ద్వారా ఎంతో ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జిస్తుంది కనుక. ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులపై కూడా అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణలు మనం పత్రికలలో చూస్తూనే ఉంటాం. వింటుంటాం. మరి ఆ వ్యవస్థను కూడా రద్దు పరిచే ధైర్యం చేస్తుందా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందా?
నిజానికి వీఆర్వో వ్యవస్థ రద్దు వెనుక పెద్ద కుట్ర దాగుంది. అది ఉద్యోగాల కుదింపు. తెలంగాణలో నిజానికి ఉద్యోగాల ఖాళీలు లేక కాదు. కేవలం ప్రభుత్వానికి ఖాళీలు నింపే ఉద్దేశంలేదు. దీనికి ఉదాహరణ తాత్కాలిక పద్ధతిలో/పొరుగు సేవల విధానంలో నియామకాలు జరుపడమే. ఈ తాత్కాలిక పద్ధతిలో/పొరుగు సేవల విధానం(ఔట్‌ సొర్సింగ్‌)లో జరిపిన నియామకాలన్నీ ప్రభుత్వం ఒప్పుకోని అధికారిక ఖాళీలే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి 78,000 ఖాళీలను నింపడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. తెలంగాణ వస్తే ఏయే రంగాలలో మెరుగైన పురోభివృద్ధి ఉంటుంది అనుకున్నామో ఆయా రంగాలలో ఏ ఫలితాలూ కనపడటంలేదు. మొత్తం ప్రజానీకానికి తప్పనిసరి అవసరమైన విద్యా, వైద్యంలో ప్రభుత్వం యొక్క శ్రద్ద ఏపాటిదో ఏ ప్రభుత్వ పాఠశాలకో, ప్రభుత్వ ఆస్పత్రికో పోతే మనకే అర్థమవుతుంది. కరోనా వంటి భయానక స్థితులలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లకు సైతం పీపీఈ కిట్లు అందించని కారణంగా వైద్యులు ధర్నాలు చేసిన సంఘటనలు మనం తెలంగాణలో చూసినం. ఆక్సిజన్‌ బెడ్స్‌ లేక ఎంతమంది ప్రాణాలు వదిలారో, ఎంతమంది ప్రయివేటు ఆసుపత్రుల దోపుకానికి బలై ఆర్ధికంగా చితికిపోయారో మనమందరం చూసాం. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కలిపి 8000 పైచిలుకు ఉన్న పోస్టులలో 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక్కరంటే ఒక్క వైద్యుడిని శాశ్వత ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఇటీవల వైద్యుల, వైద్య సిబ్బంది నియామకాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లలో కొన్ని ఒప్పంద(కాంట్రాక్ట్‌) ప్రాతిపదికన అయితే మరికొన్ని పొరుగు సేవల(ఔట్‌ సోర్సింగ్‌) విధానంలో నియమించబడేవే. ఇక విద్యా వ్యవస్థను కావాలని ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నారు. దీనికి ఇటీవల పత్రికలలో వచ్చిన 140మంది బాలికలకు ఒకటే మూత్రశాల అనేది ఒక ఉదాహరణ మాత్రమే. పాఠశాలలో పారిశుధ్య నిర్వహణకు కేటాయించిన స్కేవెంజర్స్‌ని తొలగించి పాఠశాలల పరిశుభ్రతని, పారిశుధ్యాన్ని గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయని ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రంలో పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించుకోలేని స్థితిలో ఉన్నామా? అనేది ఆలోచించుకోవాలి. ఇకపోతే ప్రభుత్వమే ప్రకటించిన 20వేల ఉపాధ్యాయ పోస్టులను నింపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ మానస పుత్రికలైన గురుకులాలలో కూడా పూర్తి స్థాయిలో నియామకాలు జరుపలేదు. కరోనా తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో కనీసం విద్యా వాలంటీర్లను కూడా నియమించలేదు. ఇక ఉన్నత విద్యావస్థను గాలికి వదిలేసింది అనవచ్చు. యూనివర్సిటీలలో 1600 ఖాళీలు నింపరు. మెరుగైన వసతులను కల్పించకపోవటమే కాక పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్య దక్కకుండా ప్రయివేటు యూనివర్సిటీలకు ఎర్రతివాచీ పరిచింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు మెరుగైన పాలనను అందించడానికి పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను అయితే ఏర్పర్చింది కానీ వాటిలో సరిపడా ఉద్యోగుల నియామకాన్ని మరిచింది. ప్రతిశాఖలో ఖాళీలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ వాటిని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి గనుక ఉద్యోగాల కల్పన పట్ల చిత్తశుద్ధి ఉంటే శాశ్వత నియామకాలు జరుపుతే తెలంగాణ సాధనలో నిజమైన ఆశయాలలో ఒకటీ నెరవేరినట్లే. కానీ ప్రభుత్వ చర్యల వల్ల నియామకాలలోనే కాదు పాలనలో, సంక్షేమ పథకాల అమలులో, హామీల అమలులో ప్రతీ దాంట్లో ఉన్నట్టా! లేనట్టా? అనే సంశయంలోనే తెలంగాణ ప్రజ ఉన్నది.
- వి. దిలీప్‌
సెల్‌:8464030808

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట
దూల తీరుతోంది...
దొంగడబ్బు ! మంచి డబ్బు!
ఆయుధాలు లేని ప్రపంచాన్ని కాంక్షిద్దాం..!
'శ్రమదోపిడీ'తో సంపాదించేదంతా 'నల్లడబ్బే'!
ప్రభుత్వరంగమే దేశానికి రక్ష..
'నల్ల డబ్బు' అంటే?
సింగరేణినీ అమ్ముతున్న కేంద్రం...
పర్యావరణ పరిరక్షణే సురక్షితం
డబ్బు! నల్ల డబ్బు! దొంగ డబ్బు! మంచి డబ్బు!
'భిన్నత్వంలో ఏకత్వం' నినాదానికే పరిమితమా!
మూఢనమ్మకాలతో హత్యలు...

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.