Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Mar 09,2022

ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు

గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి పెను సవాలు విసురుతోంది. ఓ పక్క రష్యా గర్జిస్తోంది. మరోపక్క ఉక్రెయిన్‌ ఉరుముతోంది. స్కడ్‌, క్షిపణుల ప్రయోగాలతో, సైరన్‌ శబ్దాలతో ఠారెత్తుతోంది. పరస్పర బాంబుల మోతతో యూరప్‌ దద్దరిల్లు తోంది. ప్రజలంతా హడలెత్తుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందా అని అనుమానం కలుగుతోంది. అమెరికా పాత్ర ప్రత్యక్షంగా కనపడితే ఇక మరో ప్రపంచ యుద్ధం అనివార్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పలు దేశాల ఆర్థికవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం కనపడుతోంది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు అగ్రరాజ్యాలుగా ఏర్పడటంతో ప్రపంచం ద్విధ్రువ ప్రపంచంగా మారింది. కానీ రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ సోషలిస్టు విధానాలకు స్వస్తి పలికి కాపిటలిజానికి తెరతీసి గ్లాసనోస్త్‌, పెరిస్త్రోయిక పేర్లతో సరికొత్త సంస్కరణలకు పూనుకోవడంతో 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. దాంతో అమెరికా ఒక్కటే అగ్రరాజ్యంగా నిలవడంతో ఏకద్రువ ప్రపంచంగా మారింది. అప్పటి నుంచి అమెరికా ప్రపంచ దేశాల మీద పెద్దన్నగా వ్యవహరిస్తూ అనేక దేశాల విధానాలలో జోక్యం చేసుకుంటూ తనదైన శైలిలో శాసిస్తూ వస్తోంది. ప్రపంచాధిపత్యం కోసం పాకులాడు తోంది. ఈ క్రమంలో రష్యాసరిహద్దు దేశమైన ఉక్రెయిన్‌ను నాటో కూటమి లో చేర్చుకునే అమెరికా ప్రయత్నాలే ఈ యుద్ధానికి దారితీసాయి.
మొదటి నుంచి ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలే తమ లక్ష్యమని చెబుతూ వస్తున్న రష్యా ఇప్పుడు జనావాసాల మీద బాంబులతో విరుచుకుపడు తోందనీ, ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తున్నది. రష్యామీద తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నది. ఆ మేరకు అమెరికా అనుకూల దేశాలు అనేక ఆంక్షలు విధించడం ద్వారా రష్యా దాడులను నిలువరించడంతో పాటు ఐరోపాలో పెద్ద యుద్ధం జరగకుండా ఆపే దిశగా ముందుకెళుతున్నట్లు కనపడుతున్నా ఇది సాధ్యమేనా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇదిలావుండగా అమెరికా, యూరప్‌ దేశాల ఆంక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ను యూరప్‌ దేశాలపై కూల్చేస్తామంటూ హెచ్చరించింది. అంతేకాక చార్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రాన్ని రష్యా ఇప్పటికే తన గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. అవసరమైతే అణుబాంబు సైతం ప్రయోగించడానికి వెనుకంజ వేయబోమని విస్పష్టంగా సంకేతాలు విడుదల చేస్తోంది. రష్యాను అంతర్జాతీయ వేదికమీద ఒంటరి చేయాలని తపిస్తున్న అమెరికా ఆశలు నెరవేరడం అంత సులువేమీ కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
యూరోప్‌లో అమెరికా పశ్చిమం వైపు, రష్యా తూర్పు వైపు ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి. అధికారం చేపట్టిన మొదట్లో పుతిన్‌ యూరోపియన్‌ యూనియన్‌తోనూ, పశ్చిమ దేశాలతోనూ సఖ్యంగా ఉండటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తాను పొందిన అవమానానికి తగిన గుణపాఠం చెప్పాలని సమయం కోసం వేచిచూస్తున్నాడు. అంతేకాక రష్యా విచ్చిన్నం తరువాత భాగపంపిణీలో భాగంగా క్రిమియా ద్వీపకల్పాన్ని తిరిగి తమకు ఇచ్చేయమని రష్యా కోరింది. కానీ మధ్యవర్తిత్వం వహించిన అమెరికా, బ్రిటన్‌లు క్రిమియా ఉక్రెయిన్‌లో భాగంగానే కొనసాగుతూనే స్వయం ప్రతిపత్తి ఉంటుందనే ఒప్పందాన్ని కుదుర్చాయి. కానీ 1995లో ఆ స్వతంత్ర ప్రతిపత్తి హౌదాను రద్దు చేయడమే కాక క్రిమియా నాటో భాగస్వామిగా మారడంలో అమెరికా, బ్రిటన్‌లు కీలకంగా వ్యవహరించాయి. కాలానుగుణంగా ఉక్రెయిన్‌ కూడా నాటోలో భాగస్వామిగా మారితే రష్యా భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన రష్యా ఉక్రెయిన్‌ మీద తన ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నది. సోవియట్‌ యూనియన్‌ 1991లో ముక్కలయ్యాక 15 దేశాలుగా విడిపోయింది. అందులో ఆర్మేనియా, కజికిస్థాన్‌, కిర్గిస్తాన్‌, తజికిస్తాన్‌, బెలారస్‌ దేశాలు ఇప్పటికీ రష్యావైపే ఉన్నాయి. అంతేకాక ఈ దేశాల మధ్య కలెక్టివ్‌ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌ ఒప్పందం ఏర్పడింది. ఈ ఒప్పందం ద్వారా ఆ దేశాలు రష్యాకు బాసటగా నిలుస్తున్నాయి. వీటితో పాటు చైనా, క్యూబా, సిరియా, ఇరాన్‌, ఉత్తరకొరియా మొదలగు దేశాలు రష్యా వైపు నిలిచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌కు అమెరికా, బ్రిటన్‌, జర్మనీ మొదలగు నాటో కూటమిలోని 30 దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ సరిహద్దు దేశాలతో వివాదాలు గల దేశానికి సభ్యత్వం ఇవ్వరాదని నాటో ఒప్పందంలో పొందుపరచిన నిబంధన ఉక్రెయిన్‌ నాటోలో సభ్యత్వం పొందడానికి ప్రతిబంధకంగా మారింది. సహజంగా అమెరికాను వ్యతిరేకిస్తూ వస్తున్న దేశాలు రష్యాకు బాసటగా నిలవడం, నాటో కూటమిలోని 30దేశాలు ఉక్రెయిన్‌ పక్షాన నిలవడం జరిగితే మరో ప్రపంచ యుద్ధం అనివార్యం కావొచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న చర్చలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. అయినప్పటికీ చర్చలకు ఇరుదేశాలు ద్వారాలు తెరిచే ఉన్నాయనే సంకేతాలు కొంత ఊరటనిస్తున్నాయి. అయిననూ ఇరు దేశాలు యుద్ధభూమిని వీడటం లేదు. రష్యా అభద్రతా భావం, అమెరికా ఆధిపత్య ధోరణి మధ్య ఉక్రెయిన్‌ నలిగిపోతోంది. అంతర్జాతీ యంగా నిర్ణయాత్మక శక్తిగా మారుతున్న భారత్‌ లాంటి దేశాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరమున్నది. విశ్వశాంతిని కాంక్షిస్తూ ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇరు దేశాల మధ్య విస్తృతమైన చర్చల ద్వారా సుహృద్భావ వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. రష్యా ఆందోళనను అర్థం చేసుకొని తన అభద్రతా భావాన్ని తొలగించి విశ్వాసాన్ని పాదుకొల్పాలి. ఒక దేశ సార్వభౌమాధికారంలో మరోదేశం జోక్యాన్ని నివారించే చర్యలకు శ్రీకారం చుట్టాలి. వివాదాలకు తావులేని సరికొత్త విధానాలు, ఒప్పందాలు ఏర్పడాలి. విశ్వమానవ శ్రేయస్సును ఆశించి మిగతా దేశాలు ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడం కాకుండా దౌత్యపర చర్యలు చేపట్టడానికి సహకరించి శాంతిని నెలకొల్పాలి.

- భాస్కర్‌ యలకంటి,
సెల్‌:8919464488

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దళారీ ఆకలి..
ప్రగతి చక్రం ఎటువైపు పరిగెడుతోంది?
నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి..!
ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి

తాజా వార్తలు

02:32 PM

ఫోటోలు మార్ఫింగ్ చేసి బాలిక‌కు వేధింపులు..!

02:23 PM

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు

02:14 PM

బీజేపీ సమావేశాల్లో కలకలం..!

02:08 PM

బీజేపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.