Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌ | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌

        మూడు, నాలుగేండ్ల ప్రాయంలో ఉన్న పిల్లాడిని తన తండ్రి భుజం మీద ఎత్తుకుని తోటకు తీసుకువెళ్ళాడు ఒకనాడు. తండ్రి తన స్నేహితుడితో ముచ్చటిస్తూ, కొంత సమయం గడిచాక ఏమి చేస్తున్నాడో అని పిల్లాడి వైపు చూశాడు. ఆడుకుంటాడులే అనుకున్న ఆ పిల్లవాడు భూమిలో గడ్డిపరకలు నాటుతున్నాడు. ఏమి చేస్తున్నావురా నాన్న అని అడిగితే చిన్న చిన్న తుపాకీ మొక్కలు నాటుతున్నాను, అవి పెరిగి పెద్దపెద్ద తుపాకులు కాస్తాయి. వాటితో ఇంగ్లీష్‌ వాళ్ళను చంపి దేశానికి స్వాతంత్రం తీసుకువస్తా అంటూ ఆ పిల్లాడు తలెత్తకుండా సమాధానం చెప్పాడు. ఆ పిల్లవాడి మాటలకు ఆ తండ్రి మిత్రుడు ఐదునిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. మూడు, నాలుగు సంవత్సరాల వయసు లోనే తుపాకీ పట్టాలని భావించిన ఆ పిల్లాడే తరువాతి కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన భారత విప్లవోద్యమ నాయకుడు షహీద్‌ భగత్‌సింగ్‌.
        పదమూడేండ్ల వయసులోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి భగత్‌సింగ్‌ ప్రభావితుడయ్యాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా గ్రామస్తులపై బ్రిటిష్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది నిరాయుధులైన రైతులు ప్రాణాలను కోల్పోయారు. దానికి ప్రతిగా గ్రామస్తులు తిరగబడి ఆ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఆ స్టేషనులో ఉన్న పోలీసులు కొందరు మాడి మసి అయినారు. ఈ సందర్భంగా అహింసావాది అయిన గాంధీ, హింసాయుతమైన ఆ గ్రామస్తుల తిరుగుబాటును అపరాధంగా భావించి తాను చేపట్టిన సహాయ నిరాకరణోద్యమాన్ని అర్థంతరంగా నిలిపివేశారు. దానికి అసంతృప్తి చెందిన భగత్‌సింగ్‌ విప్లవమార్గం పట్టాడు.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాక దేశంలో హిందూ ముస్లింల మధ్య తలెత్తిన సంఘర్షణలను భగత్‌సింగ్‌ కండ్లారా చూశాడు. అప్పటినుండి విప్లవకారుల స్వతంత్ర ఉద్యమానికి మతం అడ్డుగోడగా నిలుస్తుందని గ్రహించిన భగత్‌సింగ్‌, ఆ క్షణం నుండే మతోన్మాదాన్ని నిరసించారు.
        1928లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ బ్రిటిష్‌ ప్రభుత్వం సైమన్‌ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్‌లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవటంతో దేశవ్యాప్తంగా సైమన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు, నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబర్‌ 1928న ఆ కమిషన్‌ లాహౌర్‌ని సందర్శించినప్పుడు సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలాలజపతిరారు (పంజాబ్‌ కేసరి) నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ నిరసనను బ్రిటిష్‌ పోలీసులు హింసాయుతంగా మార్చారు. లాలాలజపతిరారు మీద అత్యంత క్రూరంగా లాఠీఛార్జి చేసి చాతిమీద విపరీతంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన లాలాలజపతిరారు మరణించాడు. ఈ సంఘటనను కండ్లారా చూసిన భగత్‌సింగ్‌ చలించిపోయాడు. దెబ్బకు దెబ్బ తీసి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. లాలాలజపతిరారు హత్యకు కారణమైన పోలీస్‌ అధికారి ''స్కాట్‌''ను ఎలాగైనా మట్టుపెట్టాలని విప్లవకారులు శివ రామ్‌, రాజ్‌ గురు, జై గోపాల్‌, సుఖదేవ్‌ థాపర్‌లతో పథకం వేశాడు. ''స్కాట్‌''ను గుర్తించిన జైపాల్‌ ఆయన్ను కాల్చమంటూ భగత్‌సింగ్‌కు సంకేతాలు ఇచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా ''స్కాట్‌''కు బదులు జేపి సాండర్స్‌ హతమయ్యాడు. పోలీసుల కంటపడకుండా లాహౌర్‌కి వెళ్లి అజ్ఞాత జీవితం గడిపాడు భగత్‌సింగ్‌.
        విప్లవకారుల చర్యలను కర్కశంగా అణిచివేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. భగత్‌సింగ్‌ లాంటి విప్లవకారులను అణచటం ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర శాసనసభపై బాంబు వేయాలని సామ్యవాద గణతంత్ర యువజన సంఘం వ్యూహరచన చేసింది. భగత్‌సింగ్‌తో పాటు సహవిప్లవ కారుడు దత్‌ 8 ఏప్రిల్‌ 1929న శాసనసభ వసారాపై బాంబు విసిరి ''ఇంక్విలాబ్‌ జిందాబాద్‌'' (విప్లవం వర్థిల్లాలి) అని గొంతెత్తి నినదించారు. ఈ దాడి అనంతరం ఇద్దరూ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు.
        జేపీ సాండర్స్‌ హత్య కేసులో భగత్‌సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌లను అరెస్టు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం జైల్లో పెట్టింది. విచారణలో భాగంగా దేశ స్వాతంత్రం కోసం తన గళాన్ని వినిపించడానికి న్యాయస్థానాన్ని ఒక ప్రచార వేదికగా మలుచుకున్నాడు భగత్‌సింగ్‌. హత్యా నేరాన్ని అంగీకరించిన భగత్‌సింగ్‌... బ్రిటిష్‌ ప్రభుత్వం తన దేశాన్ని, దేశ ప్రజలను ఎలా దోచుకుంటున్నదో, సామాన్య ప్రజానీకం యొక్క నిరసన గళాలను ఎలా నిర్థాక్షిణ్యంగా అణచి వేస్తుందో చెబుతూ న్యాయస్థానంలో పలు ప్రకటనలు చేశాడు. న్యాయస్థానం ఆ ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది.
        జైలులో ఉండగా భగత్‌సింగ్‌ ఇతర ఖైదీల హక్కుల గురించి పోరాడాడు. రాజకీయ ఖైదీలకు అందరికీ సరైన ఆహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, సరైన మరుగుదొడ్లు, ఇతర దైనందిన సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లతో దీక్షను చేపట్టాడు. అరవై మూడు రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్షతో బ్రిటిష్‌ ప్రభుత్వం లొంగిరాక తప్పలేదు. దీనితో భగత్‌సింగ్‌కు సాధారణ భారతీయుల్లో మరింత ఆదరణ పెరిగింది.
        జైలులో ఉన్నప్పుడు కూడా భగత్‌సింగ్‌ నిత్య అధ్యయనశీలిగా ఉండేవాడు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవం జయప్రదం అవ్వటంతో దాని వెలుగులో యూరప్‌ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేశాడు. జైల్లో ఉండగానే మార్క్స్‌, ఎంగిల్స్‌, లెనిన్‌లు రచించిన అనేక గ్రంథాలను, వాటితో పాటు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం సామాజిక శాస్త్రాలను చదివాడు. జైలు అధికారులు నీ ఆఖరి కోరిక ఏమిటి? అని అడిగినప్పుడు నేను లెనిన్‌ జీవిత చరిత్ర చదువుతున్నాననీ, నేను చనిపోయేలోగా దానిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాననీ చెప్పాడు. ఇవన్నీ తన లిఖిత పత్రాల్లో పేర్కొన్నాడు.
మార్క్సిజం అధ్యయనంతో భగత్‌సింగ్‌ ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. భారత దేశంలో ప్రథమ మార్క్సిస్టులలో భగత్‌సింగ్‌ ఒకరిని ప్రముఖ భారత చరిత్రకారుడు కె.ఎన్‌. ఫణిక్కర్‌ అభివర్ణించాడు. 1931లో జైలులో ఉండగా నాస్తికవాద తత్వాన్ని వివరిస్తూ ''నేనెందుకు నాస్తికుడనయ్యాను'' అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాడు. సర్వశక్తి సంపన్నుడు అని పిలవబడుతున్న దేవుడి పట్ల తనకు విశ్వాసంలేదని ప్రకటించాడు. ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాధలు, మూఢవిశ్వాసాలను నమ్మే స్థితికి తాను దిగజారబొనని స్పష్టం చేశాడు. నిరూపితం కాని దైవత్వం కేవలం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో పేర్కొన్నాడు.
        తనను ఉరి తీయడానికి నాలుగు రోజుల ముందు తన మిత్రుడైన ప్రసన్న మెహతా జైలులో భగత్‌సింగ్‌ను కలిసి క్షమాభిక్షముసాయిదాపై సంతకం చేయమని కోరాడు. భగత్‌సింగ్‌ క్షణం కూడా ఆలోచించకుండానే సంతకం చేయడానికి నిరాకరించాడు. బాధతో ప్రసన్న మెహతా భగత్‌సింగ్‌ యొక్క పట్టుదలను చూసి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
        23 మార్చి 1931న భగత్‌సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌ గురు, సుఖదేవ్‌లను లాహౌర్‌ జైల్లో ఉరితీశారు. సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు ఉరి తీస్తారు. కానీ, ఏమి జరుగుతుందో ప్రజలు తెలుసుకునేలోపే రాత్రి 7గంటల సమయంలో ఉరి తీశారు. ఆ జైలు లోపల నుండి ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదాలు బిగ్గరగా వినిపించాయి. జీవితానికి చివరగా తెరదించ బోతున్నారు అన్న దానికి ఇది సంకేతం అయింది. ''మేం జీవితాన్ని ప్రేమిస్తాం. మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం. నిప్పు రవ్వల మీద నిదురిస్తాం'' అన్న ఆ మహా యోధులు భరత మాత కన్న ముద్దు బిడ్డలు.

- పి.బి. చారి
  సెల్‌:9704934614

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు
ఈ యుద్ధం ప్రపంచానికో సవాలు
మహిళా బంధు...
సగటుజీవి నోట... కమ్యూనిస్టుల మాట

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.