Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Apr 06,2022

'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!

వరకట్నం.. వేధింపులు.. కుటుంబ, వివాహ సమస్యలు.. గృహహింస.. కారణమేదైనా ఇల్లాలు ఆత్మస్థైర్యం కోల్పోతోంది. బలవన్మరణాన్ని ఆశ్రయిస్తోంది. ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్‌ విడుదల చేసిన గణాంకాలు చూస్తే ఈ పరిస్థితి తీవ్రత మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళల్లో దాదాపు 40శాతం మంది భారతీయులే. ఇటీవల ప్రచురించిన లాన్సెట్‌ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గృహిణుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకుంటూనే... ప్రస్తుతం వాటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
రోజుకు 61 మంది..
ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం భారతదేశంలో 2020 సంవత్సరంలో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 50శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇంకా వీరిలో 14.6శాతం మంది అంటే 22,372 మంది గృహిణులే ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే సగటున రోజుకు 61మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ప్రతి 25నిమిషాలకు ఒక ఇల్లాలు బలవన్మరణాన్ని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 1997 నుంచి ప్రతి ఏటా 20 వేల మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, 2009 నుంచి వారి సంఖ్య 25వేలకు పెరిగింది.
ప్రధానంగా మూడే కారణాలు..
సాధారణంగా ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నా గృహిణుల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడే కారణాలు మనకు కనిపిస్తాయి.. మొదటిది గృహహింస. 30శాతం మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారని, పెళ్లి తర్వాత రోజువారీ ఇంటి చాకిరీ, అణచివేతకు గురవుతూ అత్తవారింటి జీవితంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. గృహహింసవల్ల మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల్లో ఆత్మహత్య ఆలోచనలు మూడు రెట్లు అధికంగా ఉంటాయని 2012లో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. కొవిడ్‌ సమయంలో గృహ హింస కేసులు మరింత ఎక్కువైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల్లో మూడు వంతుల మంది గృహ హింసకు గురైనట్లు ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది.
రెండో ప్రధాన కారణం వరకట్నం. గృహిణుల ఆత్మహత్యల్లో సగానికి పైగా వరకట్న వేధింపులతోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. 1930 కంటే ముందు దేశంలో జరిగిన వివాహాల్లో కేవలం 40శాతం వివాహాల్లో మాత్రమే వరకట్న వ్యవహారాలు ఉండగా, 2000 తర్వాత ఈ సంఖ్య 90శాతానికి చేరుకుంది. వరకట్న వేధింపులతో మహిళలు తిరిగి తల్లి ఇంటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. సమాజ కట్టుబాట్లు అంటూ మళ్లీ వారిని అత్తారింట్లోనే ఉండాలని బలవంతం చేయడంతో ఆత్మహత్య ఆలోచనలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
మూడో ప్రధాన కారణం ఆర్థికంగా పూర్తిస్థాయిలో భర్తలపై ఆధారపడి ఉండడం. దీని వల్ల నిరాశ, నిస్సహాయత, డిప్రెషన్‌ పెరిగిపోతోంది. దీనితోపాటు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కూడా పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. అంతేకాకుండా ప్రతి ఏడాది ఇది ఇంకా ఇంకా తగ్గుతూనే ఉంది. 'ఇంటి పనుల్లో బిజీగా ఉండడం వల్ల బయట ఇతర పనులు చేయలేమని, ఇంటి పనులు చేయడానికి కుటుంబంలో ఇతరులు ఎవరూ సిద్ధంగా కూడా ఉండరు' అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 64శాతం మహిళలు అభిప్రాయపడ్డారు. అంటే శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెల్లింపులే లేని ఇంటి పని కోసం ప్రతి మహిళ ప్రతి రోజు ఐదు గంటలు తన సమయాన్ని కేటాయిస్తుంది. ఇంకా ప్రతి రోజు రెండున్నర గంటలు పిల్లలు, భర్త సంరక్షణ సేవలకు సమయాన్ని ఇస్తుంది. మహిళలతో పోల్చుకుంటే మగవాళ్లు వీటికి కేటాయించే సమయం గంటన్నర మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు సొంత సంపాదన లేకపోవడంతో సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా వాళ్లు తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోలేకపోతున్నారు. మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడడం వలన వారు తమ డిప్రెషన్‌, ఆందోళనను తగ్గించుకోవడానికి, వివిధ మానసిక, ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీని వల్ల కూడా ఆత్మహత్యల శాతం పెరిగిపోతున్నట్లు సైక్రియాటిస్టులు చెబుతున్నారు.
నివారణ మార్గాలివీ..
గృహిణుల ఆత్మహత్యలను తగ్గించడానికి ప్రధానంగా రెండు రకాల నివారణ మార్గాలపై ఫోకస్‌ చేయవచ్చు. మొదటిది.. మహిళలను మానసిక ఆరోగ్య సమస్యల నుంచి, డిప్రెషన్‌ నుంచి కోలుకునేలా చేయడం. ముందుగా ప్రభుత్వం మానసిక సమస్యలను నివారించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ఎంతో కొంత సమస్యను నివారించవచ్చు. అయితే సమస్యే ఉత్పన్నం కాకుండా మూల కారణాలను వెతికి పట్టుకొని నివారణ మార్గాలను అన్వేషించాలి. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశముంది. దీని కోసం మహిళల ఉపాధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పురుషులు, మహిళలు ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచన విధానాల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరముంది. 2018లో ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఓ సర్వే నిర్వహించింది. పిల్లల సంరక్షణ బాధ్యతలను సరిగా నిర్వహించకపోతే మహిళలను కొట్టడం ఆమోదయోగ్యమేనని 33శాతం మంది చెప్పారు. కుటుంబానికి చెందిన పురుషులకు సరైన ఆహారాన్ని అందించకపోతే కొట్టవచ్చని 41శాతం మంది అభిప్రాయపడ్డారు. దీని ద్వారా మనం ప్రజల ఆలోచనా విధానాన్ని అంచనా వేయవచ్చు. ఈ పురుషాధిక్య భావజాలాన్ని రూపుమాపాలి. చట్టాలూ నియమాలూ ఎన్నివున్నా... పురుషులు తమ సామాజిక నిబంధనలను కొనసాగించడానికి ఏదో ఒక మార్గాన్ని కచ్చితంగా వెతికి పట్టుకున్నారు. మహిళలు, ముఖ్యంగా గృహిణుల ఆత్మహత్యలను నివారించాలంటే ప్రజల వైఖరిలో, ముఖ్యంగా మగవాళ్ల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే ఫలితం వస్తుంది.
- ఫిరోజ్‌ ఖాన్‌
సెల్‌:9640466464

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దళారీ ఆకలి..
ప్రగతి చక్రం ఎటువైపు పరిగెడుతోంది?
నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి..!
ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
జారుడు మెట్లపై ఉన్నత విద్య..
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.