Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జారుడు మెట్లపై ఉన్నత విద్య.. | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Apr 21,2022

జారుడు మెట్లపై ఉన్నత విద్య..

        సంబంధిత మౌలిక వసతులు, బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయింపు, నాణ్యమైన అధ్యాపకులు, నూతన ఉత్పత్తుల సాంకేతికతలు, ఆవిష్కరణలకు దోహదపడే పరిశోధనలు, పరిశ్రమల అనుసంధానాలతో విశ్వవిద్యాలయాలను సరికొత్తగా మలిస్తే జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఆవిష్కృతమవుతుంది. పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య బోధన, కళాశాలలో నైపుణ్య శిక్షణలతో యువ భారతం రాత మారుతుంది. కాలం చెల్లిన పాఠ్య ప్రణాళిక మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశంలోని విశ్వవిద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలుగా యువత సామర్థ్యాలను పెంచుకోగలిగే నైపుణ్య కార్ఖానాలుగా మారుతాయి.
ప్రపంచంలో 100 అత్యుత్తమ విశ్వ విద్యాలయాల జాబితాలో 2022 సంవత్సరానికి భారత్‌ నుండి ఒక్క విశ్వవిద్యాలయం సైతం లేకపోవడం దేశ విద్యా రంగ దుస్థితికి దర్పణం పడుతుంది. వచ్చే ఐదేండ్లలో 10 వేల కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా 20 విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి సృజన కేంద్రాలుగా మారుస్తామని 2017లో ప్రధాని మోడీ ప్రకటించినా ఆ సుందర స్వప్నం నేటికీ మన ఉన్నత చదువుల స్థితిగతులను మార్చలేక పోయింది. బడ్జెట్లో నామమాత్రం నిధుల కేటాయింపు, ఆర్థిక వనరుల కొరత, బోధనా సిబ్బంది లేమి, నిర్వహణపరంగా మితిమీరిన నియంత్రణలు, కాలం చెల్లిన పాఠ్య ప్రణాళికలు వంటివి పైచదువులకు చెదలు పట్టిస్తున్నాయి. వాటిని పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు యధాప్రకారం మాటలతో కోటలు కడుతున్నారు.
క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో మనం ఎక్కడ ప్రతిష్టాత్మక క్యూఎస్‌ అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాల ప్రమాణాల తీరుతెన్నులను తెలుసుకోవడానికి ప్రతి ఏటా మదింపు చేపడుతూ ర్యాంకులు ప్రకటిస్తుంది. బోధన సిబ్బంది, విద్యార్థుల నిష్పత్తి, విదేశీ ఫ్యాకల్టీ నిష్పత్తి, విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు, విశ్వవిద్యాలయ ప్రతిష్ట, పరిశోధనలు, పేటెంట్లు మొదలైన అంశాలలో మూల్యాంకన చేపట్టి ర్యాంకులను ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి ప్రపంచంలో 97 దేశాలకు చెందిన 1300 యూనివర్సిటీలు పోటీపడగా 100 మార్కులు సాధించి మసాచుసెట్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తొలి స్థానం సాధించింది. 99.5 స్కోర్‌తో ఆక్స్‌పర్డ్‌ యూనివర్సిటీ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. 98.7 మార్కులతో స్టాన్‌ ఫోర్డ్‌, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలు మూడో స్థానాన్ని ఆక్రమించాయి. తొలి 100 స్థానాల్లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, సింగపూర్‌, చైనా, జర్మనీ ఫ్రాన్స్‌ తదితర దేశాలు చోటు దక్కించుకున్నాయి. గత ఐదేండ్ల కాలంలో ఈ దేశాలు పరిస్థితిని మెరుగుపరుచుకుంటే భారత్‌ మాత్రం దిగజారుతోంది. తొలి 100 ర్యాంకులు సాధించిన విశ్వవిద్యాలయ జాబితాలో భారత్‌ నుండి ఒక్క విశ్వవిద్యాలయం లేకపోవడం మన ఉన్నత విద్య దుస్థితికి అద్దం పడుతున్నది. దేశంలో ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ బాంబే 46.4 స్కోరుతో 177వ స్థానాన్ని ఆక్రమించి క్యూఎస్‌ జాబితాలో భారత్‌ నుండి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఢిల్లీ 185వ స్థానాన్ని, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు 186వ స్థానాన్ని సాధించాయి. టాప్‌ 500 విశ్వవిద్యాలయాల జాబితాలో కూడా మన దేశం నుండి కేవలం ఎనిమిది మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కూడా ఆ ఘనతనూ సాధించలేకపోయాయి. ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 591వ స్థానాన్ని, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 651వ స్థానాన్ని సాధించాయి. ప్రపంచ విద్యాసంస్థల గుర్తింపునకు అవసరమైన ప్రమాణాల విషయంలో ఆసక్తి కనబరచకపోవడం వల్ల భారత విద్యాసంస్థలు వెనుకబడుతున్నాయి. క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో భారతదేశం నుండి 2018లో 20 యూనివర్సిటీలు 2019లో 24 యూనివర్సిటీలు 2020లో 23యూనివర్సిటీలు 2021లో 21యూనివర్సిటీలు, 2022లో 22 యూనివర్సిటీలు టాప్‌-1000 స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరిగి, బోధనాభ్యసన పరిశోధనల్లో నాణ్యత కొరవడింది. పారిశ్రామిక అనుసంధానం తక్కువగా ఉంది. నిధుల లేమి సౌకర్యాల కొరతతో విశ్వవిద్యాలయాలు కొట్టుమిట్టాడు తున్నాయి. విద్యార్థులు నామమాత్ర అభ్యాసంతో పట్టాలు అందుకుని నైపుణ్యాల కొరతతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అత్యున్నత విశ్వవిద్యాలయ జాబితాలో స్థానం సంపాదించుకోవాలంటే అత్యున్నత ప్రతిభ గల అధ్యాపకులను నియమించుకోవడం ఒకటే మార్గం. కానీ మన విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్ల, అధ్యాపకుల నియామకాల తీరులో అలసత్వం చోటుచేసుకుంటున్నది.
అధ్యాపకులే కీలకం
        ఇతర విద్యావ్యవస్థలోనైనా బోధకులదే ముఖ్యపాత్ర. నాణ్యమైన విద్యను అందించడంలో ఇతరులది సహాయ పాత్రే. విద్యా ప్రమాణాల్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన అంశాల్లో విద్యా వ్యవస్థలో ఉండే బోధనా సిబ్బందిలోని నాణ్యతా సామర్థ్యం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. బోధకులు విద్యార్థుల మధ్య నిష్పత్తి అధికంగా ఉంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడి తగిన రీతిలో ఏకాగ్రత చూపలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉంది. దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 12900 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 22 వేల బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పది ప్రధాన యూనివర్సిటీలలో 1974 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన యూనివర్సిటీలలో 108 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తొలి వేయి విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించిన ఉస్మానియా యూనివర్సిటీలో 848 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం యూనివర్సిటీలో దాదాపుగా 30 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో 232 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి ఖాళీల ఒత్తిళ్ల వల్ల అధ్యాపకులు అవసరమైన రీతిలో సన్నద్ధం కాలేని పరిస్థితి నెలకొంటుంది. పరిశోధనకు తగిన సమయం కేటాయించలేరు. బోధన అనుబంధ కార్యకలాపాలపైన దృష్టి సారించలేరు. సంబంధిత మౌలిక వసతులు, బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయింపు, నాణ్యమైన అధ్యాపకులు, నూతన ఉత్పత్తుల సాంకేతికతలు, ఆవిష్కరణలకు దోహదపడే పరిశోధనలు, పరిశ్రమల అనుసంధానాలతో విశ్వవిద్యాలయాలను సరికొత్తగా మలిస్తే జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఆవిష్కృతమవుతుంది. పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య బోధన, కళాశాలలో నైపుణ్య శిక్షణలతో యువ భారతం రాత మారుతుంది. కాలం చెల్లిన పాఠ్య ప్రణాళిక మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశంలోని విశ్వవిద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలుగా యువత సామర్థ్యాలను పెంచుకోగలిగే నైపుణ్య కార్ఖానాలుగా మారుతాయి.


సెల్‌:6301650324

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దళారీ ఆకలి..
ప్రగతి చక్రం ఎటువైపు పరిగెడుతోంది?
నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి..!
ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా?
క్రీడల పట్ల యువత విముఖత
అదనపు విలువే లేకపోతే?
ఎడారీకరణ - ఓ పెద్ద సవాలు
ఆసుపత్రి శ్రమల్లో రకాలూ.. వాటి విలువల్లో తేడాలూ
నాలుగుదశాబ్దాల కనిష్టస్థాయికి చేరిన 'పిఎఫ్‌ వడ్డీరేటు'
పాఠశాల విద్యా ప్రమాణాలపై కరోనా పంజా...
ఉత్పత్తి తయారీకి మూలం: పాతశ్రమా, కొత్తశ్రమా!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
మంకీపాక్స్‌ వైరస్‌ ప్రాణాంతకమా???
'ఆస్పత్రి' అనేది ఒక పరిశ్రమే!
ఫ్యామిలీ డాక్టర్‌ ప్రాధాన్యత
బీడీ కార్మికుల బ్రతుకు పోరాటం..
'అన్నిఉచిత పథకాలూ సముచితమేనా...!?'
అంబేద్కర్‌ ఆశయానికి తూట్లు
బానిసత్వం నుండి బయటపడటమే బాబాసాహెబ్‌కు నివాళి
కుల నిర్మూలనపై పోరాడిన యోధుడు అంబేద్కర్‌
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
భూగర్భ జలాల సంక్షోభం రానుందా..!
జనరిక్‌ మందులే జనానికి మేలు
సకల సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగేదే విద్య
విలవిల్లాడుతున్న పోడు రైతులు?
సామ్యవాద స్వాప్నికుడు భగత్‌సింగ్‌
భగత్‌సింగ్‌ వీలునామాను పాఠ్యాంశంగా చేర్చాలి
దేవుని గురించి ఆస్తికులు.. నాస్తికులు..
కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
మూత్రపిండాలు.. రసాయన కర్మాగారాలు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.