Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌.. | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..

- వరుస కేసులతో హల్చల్‌
- కార్పొరేటర్లలో ఆందోళన

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో కార్పొరేటర్ల భూకబ్జాలపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తొలుత బిఆర్‌ఎస్‌కు చెందిన 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ను పోలీ సులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో నగరంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తా జాగా కాజీపేట ప్రాంతానికి చెందిన 62వ డివిజన్‌ కార్పొ రేటర్‌ కాంగ్రెస్‌కు చెందిన జక్కుల రవీందర్‌పై మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ అరెస్ట్‌ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో అల జడి ప్రారంభమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్‌ జక్కుల రవీందర్‌పై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. జనగా మ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డికి కార్పొరేటర్‌ జక్కు ల రవీందర్‌ ప్రధాన అనుచరుడు. రవీందర్‌పై కేసు నమో దు కావడాన్ని 'జంగా' తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అరెస్ట్‌ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తన అనుచరుడిపై కేసు నమోదు చేశారని, ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారించాలని, రవీందర్‌ భూకబ్జాలు చేసేవాడు కాదని స్పష్టం చేశారు. కార్పొరేటర్లపై భూకబ్జా కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరం పరిధి లో భూముల వ్యవహారాలు, వివాదాల్లో కార్పొరేటర్ల ప్రత్యక్ష పాత్ర వుందన్నది బహిరంగ రహస్యమే. దీనికి పరోక్షంగా గాడ్‌ ఫాదర్‌లుగా వున్న సంబంధిత ఎమ్మెల్యేల పాత్రపై సర్వత్రా చర్చ సాగుతుంది. భూకబ్జాలలో పాత్ర వున్న కార్పొ రేటర్లపై కేసులు పెడుతున్నా పోలీసులు, తెర వెనుక ఉన్న పెద్దలపై కేసులు పెడుతారా ? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో కార్పొరేటర్లపై భూకబ్జా కేసులు నమోదు కావడం, అరెస్ట్‌లు జరుగుతుండడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో, నగర శివార్లలో భూములకు విపరీతమైన డిమాండ్‌ పలుకుతుండడంతో భూ వ్యవహారాలు, వివాదాల పరిష్కారం పేరిట కార్పొరేటర్లు జోక్యం చేసుకొని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సెటిల్‌మెంట్లు చేస్తున్న పరిస్థితి వుంది. ఈ వ్యవహారాల తెర వెనుక ప్రజాప్రతిని ధులున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ కాకతీయ కాలనీలో ఒక భూమి కబ్జా విషయంలో భాధితులు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ ఛీఫ్‌ విప్‌, బిఆర్‌ఎస్‌ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరుభాస్కర్‌కు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ అరెస్ట్‌ బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో అలజడి సృష్టించింది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఎ.వి. రంగనాధ్‌ వచ్చాక శాఖపరంగా తప్పు చేసిన పలువురు పోలీసు అధికారులను సైతం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. నగరంలో భూ కబ్జా లపై దృష్టిసారించిన పోలీసు కమిషనర్‌ భూకబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌, జనగామ డిసిసి అధ్య క్షులు జంగా రాఘవరెడ్డి ముఖ్య అనుచరుడు జక్కుల రవీందర్‌పై భూ కబ్జా కేసు నమోదు కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతు న్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో వాస్తవమని తేలితే అరెస్ట్‌ చేసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ జక్కుల రవీందర్‌ భూ కబ్జాలు చేసేవాడు కాదని, సంబంధిత భూమిని కొనుగోలు చేసిన అన్ని పత్రాలున్నాయని, విచారణ చేసి నిజనిజాలు తేల్చాలని జంగా రాఘవరెడ్డి కోరడం గమనార్హం. జక్కుల రవీందర్‌పై కేసు పెట్టడంలో రాజకీయ కుట్ర వుందని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌పై భూకబ్జా కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసిన విషయాన్ని మళ్లిం చడానికే కాంగ్రెస్‌ కార్పొరేటరైన నా అనుచరుడిపై కేసు పెట్టారన్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
మరికొందరు కార్పొరేటర్లపై..?
నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న మరికొందరు కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదయ్యే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయ పార్టీల అండదండలతో బెదిరించి భూ సెటిల్‌మెంట్లు చేసిన వ్యవహారంలో బాధితులు ఒక్కరొక్కరు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పోలీసు అధికారులు కార్పొరేటర్లపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో నగరంలో మరికొందరు కార్పొరేటర్లు, రాజకీయ నేతలపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఈ కేసుల నేపథ్యంలో పొలిటికల్‌ డ్యామేజీ కాకుండా నష్టనివారణలో భాగంగా పరస్పరం కేసులు పెట్టుకునే ప్రయత్నంలోనూ రాజకీయ పార్టీల నేతలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా భూకబ్జాల వ్యవహారం, కేసులు, అరెస్ట్‌లు ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జనగామలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మహాసభ సక్సెస్‌
పాత నేరస్తులపై దృష్టి సారించాలి : జిల్లా ఎస్పి సురేందర్‌ రెడ్డి
అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి : ఆర్‌ సరోజన
ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్న మోడీ
మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శికి పీఏసీఎస్‌ చైర్మన్‌ సన్మానం
ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత : కలెక్టర్‌
పెంచిన డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్‌్‌ పరీక్ష ఫీజులను తగ్గించాలి
ప్రతీ ఒక్క దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలి : కలెక్టర్‌ శశాంక
హమాలీ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : సీఐటీయూ
సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సంక్షేమమే శ్వాసగా...అభివృద్ధే ధ్యాసగా పాలన
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నేతల దీక్ష
ప్రణాళిక లోపంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా
జీడబ్ల్యుఎంసీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆగ్రహం
సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి

తాజా వార్తలు

03:01 PM

దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

02:49 PM

ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటాను : రాహుల్‌ గాంధీ

02:39 PM

ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం..

02:29 PM

తీన్మార్‌ మల్లన్నకు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

01:56 PM

నటి ఆత్మహత్య కేసులో ఊహించని ‍ట్విస్ట్‌ ఇచ్చిన తల్లి

01:44 PM

రేపు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్

01:41 PM

షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత

01:38 PM

అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్

01:34 PM

ఎంపీ అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు..

01:12 PM

ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు!

12:57 PM

ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్‌రావు

12:49 PM

నగరంలో 90 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపు

12:34 PM

ప్రారంభమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం

12:30 PM

రామోజీరావుకు సిఐడి నోటీసులు

12:26 PM

ఆడ చీత సాషా మృతి

12:26 PM

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌స‌భ వాయిదా

12:20 PM

ఎన్టీఆర్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్!

11:36 AM

ముగిసిన హెచ్ 1బీ వీసాల కోటా

11:29 AM

టిటిడికి రిజర్వ్‌ బ్యాంక్ భారీ షాక్‌

11:18 AM

నగరంలో మళ్లీ మొదలైన పోస్టర్ వార్...

11:15 AM

విశాఖలో జీ-20 సదస్సు ప్రారంభం

11:14 AM

ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన

11:02 AM

భార్యను హత్య చేసి మంచం కింద ద‌సిన భర్త

10:42 AM

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...

10:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

10:36 AM

మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు

10:31 AM

కాబుల్‌లో ఆత్మహుతి దాడి...ఆరుగురు మృతి

09:29 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09:19 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

09:13 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.