Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి

- వ్యకాసా రాష్ట్ర సహాయ కార్యదర్శి  బిరెడ్డి సాంబశివ
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసు కున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజాసం ఘాల పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రంలో గుడిసవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ నుండి డప్పు చప్పుల్లతో స్థానిక తహసీల్ధార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి తహసీల్‌ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈసందర్భంగా బిరెడ్డి సాంబశివ మా ట్లాడుతూ... పస్రా పరిధి శివారు సర్వేనెంబర్‌-109లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. గుడిసె వాసులకు కనీస అవసరాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గుడిసెవాసులకు రూ.5లక్షలతో పక్కా ఇండ్లు నిర్మించవ్వాలన్నారు. నేటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గుడిసెలు వేసు కున్న పేదలందరికీ హక్కుపత్రాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పేదలు, వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు దశలవారి పోరాటాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు. కాగా ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ తుమ్మల వెంకట రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతు సంఘం నాయకుడు తీగల ఆగిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొదిళ్ల చిట్టిబాబు, ప్రజా సంఘాల నాయకులు అంబాల పోషాలు, కడారి నాగరాజు, గుండు రామస్వామి జటబైన రమేష్‌, పల్లపు రాజు, కందుల రాజేశ్వరి, సరిత, సువర్ణ, సకినాల రాజేశ్వరి, పాయం శారద, అంబల మురళి, అరుణ, రాంబాబు పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వరంగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ రంగయ్య, సీఐటీయూ వరంగల్‌ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాల యం ఎదుట ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు సాగర్‌ అధ్యక్షతన మహ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రజా సంఘా లు సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ ఆవాజ్‌, పీఎన్‌ఎం సంఘాల నాయకులు, కార్యక ర్తలు పాల్గొని నినాదాలు చేశారు. 58 జిఓ ప్రకారం అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, 100 గజాల లోపు జాగ ఉన్న వాళ్ళకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో ఏండ్ల తర బడి కార్మికులు, పేదలు ఇండ్ల కిరాయి కట్టలేక చాలి చాలని వేతనాలతో దుర్భర జీవితాలు గడు పుతున్నారన్నారు. వారు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారన్నారు. రెండు పడక గదుల ఇండ్ల కోసం వేలాది మంది దర ఖాస్తు చేసుకున్నా ఎవరికీ ఇండ్లు అందివ్వడం లేదన్నారు. వరంగల్‌ నగరంలో నూతనంగా వేసు కున్న గుడిసెలలో మౌలిక వసతులు కల్పించేం దుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అస ిస్టెంట్‌ కమిషనర్‌ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మ్మూర్తి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఎండి బషీర్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి దుర్గయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారీ సింగారపు బాబు, సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్‌, పాషా, ఐద్వా జిల్లా నాయకులు భవాని, ప్రత్యూష, పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలి
ములుగు : ములుగు మండల వ్యాప్తంగా చాలామంది నిరుపేదలు ఇంటి స్థలాలు, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వా లని ఏఐకేఎస్‌, డీవైఎఫ్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములుగు తహ శీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తాహా సిల్దార్‌ చంద్రశేఖర్‌కు శుక్రవారం వినతిపత్రం అం దించారు. ఈ సందర్బంగా రైతుసంఘం జిల్లా ఉపాద్యక్షులు యండి అమ్జద్‌ పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యండి గఫూర్‌ పాషా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రమేష్‌, డీ వైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్‌ మాట్లా డారు. గత ప్రభుత్వాలు పేదల కోసం ఇంటి స్థ లాలు కేటాయించి పంచిన ఇండ్ల స్థలాలను మళ్లీ ఇప్పటి ప్రభుత్వం అభివద్ధి పేరుతో ప్రభుత్వ కా ర్యాలయాల నిర్మాణం పేరుతో లాక్కోవడం హే యమైన చర్య అన్నారు. ములుగు ప్రాంతంలో డబుల్‌ బెడ్‌ రూములు పూర్తి స్థాయిలో నిర్మించ డంలో నిర్లక్ష్యం నెలకొందన్నారు. మండలంలో ఉన్న నిరుపేద ప్రజలకు ఇల్లు స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పురుషోత్తం తిరుపతి రాజేశ్వరి, రాదమ్మ, నగేష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పజా సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి : ప్రజా సమస్యలు పరిష్కరిం చాలని సీఐటీయూ జిల్లా నాj ుకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రజా సంఘాల పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని తహస ిల్దార్‌ కార్యాల యం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ... నిలువ నీడలేని నిరుపేదలు, కార్మికులు, రైతులు వ్యవ సాయ కార్మికులు, మహిళలు, ఆదివాసీలు యువ జనులు, విద్యార్థులు ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ అన్ని కులాల పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు గూడు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల న్నారు. భూపాలపల్లి పట్టణంలో అద్దెకు నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలకి ఇవ్వాలని, భూ పాలపల్లిలో కట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఇల్లు లేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌ ఎండి ఇక్బాల్‌కు అందించారు. సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు, కాంపేటి రాజయ్య, చెన్నూరి రమేష్‌, టీఏజీఎస్‌ అధ్యక్ష కార్యదర్శులు పొలం రాజేందర్‌ ,సూదుల శంకర్‌, ఇల్లు లేని నిరుపేదలు, రైతులు ,వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలు యువకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.