Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత

- ఆనాటి ఊచకోత రాజకీయ ప్రేరేపితం
- ఒక వర్గం వారిపై హిందూత్వ శక్తుల్ని ఊసిగొల్పి..పోలీసులను ఆపారు
- అల్లర్లకు వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక : బ్రిటీష్‌ ప్రభుత్వ విచారణ బృందం నివేదిక
- నివేదికలోని ముఖ్యాంశాలతో బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం
లండన్‌ : 2002 గుజరాత్‌ అల్లర్లకు ప్రధాన బాధ్యుడు ఆనాటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోడీ..అని బ్రిటీష్‌ ప్రభుత్వ విచారణ బృందం తేల్చింది. అంతేకాదు, ఊచకోతకు, అల్లర్లకు పాల్పడిన హిందూత్వ శక్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని, ఏం చేసినా పోలీసులు అడ్డుకోరనే సంకేతాలు పంపినందువల్లే దారుణాలు జరిగాయని విచారణ బృందం నిర్ధారించింది. విచారణ బృందం నివేదికలోని ముఖ్యాంశాల్ని చూపుతూ మంగళవారం బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో గుజరాత్‌ అల్లర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 'ద మోడీ క్వశ్చన్‌' అనే పేరుతో డాక్యుమెంటరీ ప్రసారమైంది. విచారణ బృందంలోని సభ్యుడైన ఒక మాజీ దౌత్యవేత్త మాట్లాడుతూ, ''విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు అల్లర్లకు ప్రణాళికలు వేశాయి'' అని చెప్పారు. మోడీ ప్రభుత్వం నుంచి లభించిన పోలీస్‌ రక్షణతోనే వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెలరేగిపోయాయని, అమాయక పౌరులపై దాడులకు తెగబడ్డాయని నివేదిక స్పష్టంగా పేర్కొంది. విచారణ బృందం నివేదిక బ్రిటన్‌ ప్రభుత్వానికి చేరిందని, ఇందులోని విషయాలేవీ ఇప్పటివరకూ బయటకు రాలేదని డాక్యుమెంటరీ పేర్కొంది. బుధవారం వెబ్‌సైట్‌ నుంచి డాక్యుమెంటరీని బీబీసీ తొలగించింది.
గోద్రా రైలు దర్ఘుటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోవటంతో 2002 ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో గుజరాత్‌ అంతటా మైనార్టీ ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. అల్లర్లలో 790మంది ముస్లింలు, 254మంది హిందువులు చనిపోయారని అధికారిక నివేదికలో గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొంది. మత ఘర్షణల్ని గుజరాత్‌ ప్రభుత్వం అడ్డుకోలేదన్న ఆరోపణల్ని సీఎంగా నరేంద్రమోడీ తిరస్కరించారు. అయితే తాజాగా బహిర్గతమైన బ్రిటీష్‌ ప్రభుత్వ విచారణ నివేదిక మాత్రం అల్లర్లకు ప్రధాన బాధ్యుడు నరేంద్రమోడీయేనని ఆరోపించింది. గుజరాత్‌ పోలీస్‌ రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోకుండా ఆయనే అడ్డుకున్నారని విచారణ నివేదిక పేర్కొంది. ఈ మొత్తం ఘటనపై ప్రత్యేక విచారణ బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగా, సరైన సాక్ష్యాధారాలు లేవని మోడీ, మరో 63మందికి క్లీన్‌చిట్‌ లభించింది. సిట్‌ నివేదికను 2013లో సుప్రీం ఆమోదించింది. అయితే పోలీసులు రంగంలోకి దిగకుండా నరేంద్ర మోడీ అడ్డుకున్నారనేందుకు ఆధారాలున్నాయని బ్రిటీష్‌ ప్రభుత్వ నివేదిక ఆరోపించటం గమనార్హం.
బయటకు తెలిసిందే కొంతే
గుజరాత్‌ 2002 అల్లర్లు రాజకీయ ప్రేరేపితం. ఇందులో లక్ష్యం సుస్పష్టం. హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఊచకోత సాగింది. ఈ ఊచకోతలో బలైన వారి వివరాలన్నీ బయటకు రాలేదు. మీడియాలో, ఇతర మాధ్యమాల్లో బయటకు తెలిసినదానికంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఊచకోత సాగిందని డాక్యుమెంటరీ తెలిపింది. ఒక వర్గానికి చెందినవారిని ప్రణాళిక ప్రకారం చంపారని, లైంగికదాడులు ఎక్కువ సంఖ్యలో జరిగాయని పేర్కొంది. ప్రధాని మోడీపై గుజరాత్‌ అల్లర్లు ఒక మాయని మచ్చ..అని బ్రిటీష్‌ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్‌ స్ట్రా ఆరోపించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అన్నారు. సీఎంగా ఉన్న మోడీ ఆనాడు హిందూత్వ శక్తులను ఊసిగొల్పి, మరోవైపు పోలీసుల చేతులు కట్టేశారని చెప్పారు. ఈ ఆరోపణల కారణంగా బ్రిటిష్‌ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు మోడీక వీసా నిరాకరించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వారానికి రూ.3,000 కోట్లు
అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు
వెనిజులా విప్లవ నేత చావెజ్‌కు పలువురు నేతల నివాళులు
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ కన్నుమూత..

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.