Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | పోయెట్రీ | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • పోయెట్రీ

పోయెట్రీ  

తుకుడే గ్యాంగ్‌!
Sat 26 Feb 23:10:28.339334 2022

చలి చీమలు
మబ్బులు గుమిగూడినట్లు
మెల్ల మెల్లగా సమావేశమవుతున్నాయి
దేశంలోకి బలవంతమైన సర్పమొకటి జొరబడ్డదని!
చీమల్ని విడదీసి వెంటాడి
వేటాడుతున్న సర్పం
అఖండ భారతాన్ని కలగంటున్నది!
ముప్పును పసి గట్టిన చీమలు
ఒక్కటై

అయిపాయె
Sat 26 Feb 23:09:50.020688 2022

మట్టిది అయినా ఫరవాలేదు
మనది అయితే బాగుండు
ఎత్తు తక్కువ అయినా
అడుగు అడుగులో ఆత్మ కనపడేది..

చూసినప్పుడల్లా చైనా వోని
పుల్వమా ద్రోహం గుర్తుకు వచ్చే
కోట్లు అప్పనంగా అర్పించి
మనవాళ్ళ మీదకే మళ్లీ దాడి....

ప్రపంచ ప్రయాణం
Sat 26 Feb 23:05:33.817842 2022

తల్లి భూదేవికి పిల్లలంటే ప్రేమ
మట్టిపై, నీటిలో జీవజాలమంతా తన పిల్లలే
కడుపులో ముప్పావు కన్నీటి సముద్రాలున్నా
ధైర్యంగా జీవనం, మంచి కోసమే మధనం
అత్యాశ నిచ్చెనలు ఆకాశానికి వేయలే
బాధల ఉప్పునీళ్లు తనలోనే దాచుకొని
మంచి నీటి ఆ

కవితా క్రాంతదర్శి
Sat 19 Feb 23:15:12.760851 2022

అతడు...
నడిగూడెం శనగసేల ఎర్రసెలకలమీంచి
పచ్చపచ్చగా పూసిన తంగేడు పూల గొడుగు కిందనుంచి
ఒకచేత్తో ముండ్లకర్రను త్రిశూలంలా పట్టుకొని
మరోచేత్తోడమరుకాన్ని
దిగంతాలు మారుమ్రోగేలా మోగిస్తూ...
నలుదిక్కుల్ని ఆలింగనం చేసుకొని

రండి...వ్యవసాయానికి సాయం చేద్దాం
Sat 19 Feb 23:09:43.968918 2022

కలిసి రండి కదలి రండి, కదం తొక్కి పదం పాడి,
పొలం దున్నే రైతన్న కు సాయం చేద్దాం. ?
కష్టమైనా, నష్టమైనా, దుక్కి దున్ని నారు పోసి, నీరు పెట్టి,
పైరు పెంచి, బంగారం పండించే రైతన్నా!
లోకానికి అన్నం పెట్టే రైతన్నా నీకు రాజసం ఎక్కడన్నా !

పాల కంకి !
Sat 19 Feb 22:51:12.366127 2022

నాన్న అడుగుల్ని కదిపితే
పంట వైపే సాగేవి
కలల సాగు చేసాక
పంటను పాపాయిలా తడిమి
తన శ్రమతో
పాలకంకిని చేసేవాడు

కంకులు నిటారుగా నిలబడితే
ఊరి గువ్వలు
మా చేను నేస్తాలయ్యేవి
చేనంతా పచ్చదనంతో ప్రజ్వరిల్లుతుం

సమాధుల ఉదయాలు
Sat 12 Feb 22:53:45.19689 2022

కండ్లు తెరిస్తే సమాధుల్లోంచి సూర్యుడు లేచి పలకరిత్తడు. సావుపుట్కల బతుకుమాధుర్యపు తత్వాల్ని మోసుకొస్తున్న గాలి చెంపల మీది నీటిబిందువుల్ని ఎత్తుకెళ్తుంది. ఇంటిముందరి ఒంటరి వేపచెట్టు వేర్లు పాతిపెట్టబడ్డ నా జాతి మూలవాసులతో ఎడతెగని వాదనలో మునిగి సమాధి

తోపుడు బండి ...
Sat 12 Feb 22:52:42.582199 2022

కూడలిలో తోపుడు బండి చుట్టూ
తోసుకుంటూ తోసుకుంటూ జనం !
బండి బహు చిన్నదే !
వస్తువులు అంగడి అంగడిగా
పుష్పక విమానంలో ఉన్నట్లే
పెద్ద షాపులాగే షోకుల బండి
తోపుడు బండి చుట్టూ గుంపు గుంపుగా ఉన్నది
ఆడంబరంగా ఉన్నవాళ్లు కాదు

తనహాయి....
Sat 12 Feb 22:41:08.088072 2022

గులాం అలీ గొంతు
ఒంటరితనపు నిర్వచనం ఇస్తుంటే...
''సన్నాటా''...గుండెను కోసుకుంటూ పోతుంది.
కొమ్మ ఒకటి ఆకులతో ఊసులేకుండా ....
నిశ్శబ్దంగా గాలిని నెమరువేసుకుంటూ ఉంది.
దూరంగా పిట్ట ఒకటి...
తన గుండెచప్పుడుకు
గుబులు

పోరాటం మిగిలే ఉంటది !
Sat 05 Feb 22:56:03.480102 2022

త్యాగాలన్నీ..
స్థూపాలకు పరిమితమైపోయినై
సందర్భోచితంగ నాల్గుపూలు జల్లే
సంస్మరణ స్థలాలుగ వాసికెక్కినయి.

స్వరాష్ట్రమే ఏకైక లక్ష్యంగ
ఒక్కచోట జట్టుగ నిలబడ్డోళ్ళు
ఇప్పుడు సంఘాలుగ వర్గీకరించబడ్డరు.
విభజించి పాలించు

మట్టి కుండ
Sat 05 Feb 22:46:28.942426 2022

తాటాకుతో కప్పిన పూరి గుడిసెలో
నేలజారిన మట్టి కుండవైపే చూస్తుంది మాయమ్మ.

పదిలంగా దాచుకున్న ఆరు అణాలతో
అత్తారింట్లో అడుగిడిన తొలినాళ్లలో కొన్న
మట్టి కుండ అది.

మట్టి పాత్రలో తోడుకున్న పెరుగు .
అమ్మ మనస్సులా స

ఏమో ?
Sat 29 Jan 22:53:48.663653 2022

పిచుకల గుంపు
నీ చుట్టూ నో
ఎదురుగా నో చేరి

గంపలు, గంపల కొద్ది ప్రశ్నలు
కుప్పలు పేరుస్తున్నాయై, ఏం?

పట్టించుకో వేం
నిద్రనో, చెవిటి తనమో ప్రదర్శిస్తావ్‌
నిర్లక్ష్యం చేస్తున్నావ్‌, ఆ

ఆయాసమొక్కటే సహచరి!
Sat 29 Jan 22:52:52.830792 2022

అవిశ్రాంతంగా
ఎంత దూరం పరుగెత్తానో
ఆ చివరొక విశ్రాంత గహముంటుందని!

కను చూపు మేర
నేనూ
నింగీ నేలా తప్పా!

సమూహాలనూ
అనుచరులనూ నెట్టుకుంటూ
ఇక్కడికొస్తే అయాసమొక్కటే సహచరి!

ధ్యాసంతా గమ్యం

ఉండలేనే మనసా...
Sat 29 Jan 22:47:44.1625 2022

మౌనముసుగులో
నల్లని ముఖంతో అలిగిన రాత్రి
తెల్లటి చీకటిలో స్పర్శమగతలో
స్నానమాడిన మనసుతో
శుభ్రపడిన పొరల మధ్య
జ్ఞాపకాలను అలంకరించుకుని
పొద్దుకో రకంగా పురివిప్పే అందంతో
పడగ్గదిలో ముసిరే ఆలోచనకు
విరిసిన కల విప్పార

ఎన్నికల వేళ
Sat 29 Jan 22:33:59.777569 2022

ఎన్నికల సమయం వచ్చేసింది
అదే పాత మొఖాలతో తిరిగి మా కాలిబాట గోడలపై
మరొక్కసారి, మీ అమూల్యమైన ఓటు

గోడకు రంగులపోస్టర్‌ అతికించబడింది,
మిమ్మల్ని మరియు నన్ను చూసి ముసిముసిగా నవ్వుతూ, మనము ఇప్పుడు మళ్లీ గెలిపించాలని, మన దయన

రైతులు రాజ్యమేలని రాజులు
Sun 23 Jan 11:26:55.156912 2022

మట్టిని పిసికిన చేతులు
అనుభవించిన కష్టాల బతుకులు
ఆకుపచ్చని నారు మడిలో
రైతులు రాజ్యమేలని రాజులు

పొలం దున్నిన హలాలన్నీ
చిలికింది జలధార ఎద సొదల్లో
వరద గుడేసి నిండిన చెరువుల
రైతులు రాజ్యమేలని రాజులు

కవిత్వమే నినాదం
Sun 23 Jan 11:26:24.824974 2022

కవిత్వం రాయి
ఆ కవిత్వం అరికాలికి ముల్లు నాటితే
తలలో వెంట్రుక సుడి తిరిగినంత
నొప్పి బరాయింపుతో కవిత్వం రాయి.

ప్రజల కవిత్వమే రాయి
లేదా అస్సలు రాయకు.

ఊరినుండి వెలివేసినవారికి
నీ కవిత్వం ఊపిరవ్వాలి
అ

మరణ శాసనాలు...
Sun 23 Jan 11:20:42.908223 2022

పాలకులు ఇప్పుడు నియంతల పాత్రలో
ముందు వెనకా చూడలేని మొండి ఆలోచనల్లో
ఎప్పుడు ఏ శాసనం యమ పాశం అవుతుందో

చేయని తప్పులకు ప్రజలకు శిలువలు
మానవీయ కోణం లేని కఠిన శాసనాలు
మరణ మదంగం వాయిస్తూ మన పాలకులు

పార్లమెంట్&zw

ప్రతీక
Sat 08 Jan 23:54:17.897675 2022

అనుకుంటూనే వున్నా
ఇంకా నా మీద కన్ను పడలేదని
అందమైన నా పయ్యెదని చిదమ కుట్ర పన్నలేదని

నేను పుట్టిన దగ్గరి నుండీ
నన్ను నా అందాన్ని గౌరవించిన వారెందరో
నేను నిలబడ్డ ఆ కూడలి
ఆసరాగా ఎందరికో ఊరట

చిన్నా చితక బ

ఏటి గత్తె
Sat 08 Jan 23:36:54.910886 2022

రెక్కలు వల ఇసిరే
ఏరు ఇది
తరాలుగ తరగని నిధి
తలలో కలలు పొదిగే
తలమిది

పొద్దంచు చీర
దరిలో దోపుకొని
ఈడు పారి ఈల ఏస్తుంది
ఏరుకు ఏండ్లు ఎక్కవు
నిత్తె పొల్ల

గాలిగుంపు తెడల్ని లేపి
అల్లరి చ

కండ్లలో దాగిన పల్లె కన్నీళ్లు
Sat 08 Jan 23:35:20.139064 2022

ఇంటి ఎనకాలవుండే పెరడు లేదు.
వీదుల్లో వుండే రచ్చబండ లేదు.
ఇంటి చుట్టూ హద్దులు గీసిన..
గోడలు మోలుస్తున్నాయి.
మనిషికీ మనిషికీ మధ్య అహంకారాలు మొలిచినట్లు.
ప్రేమగాపిలిచే మాటల్లేవు ఇపుడు.
సహాయం చేసే చేతుల్లేవు.
ఊరిపుడు

కరోనా
Sat 08 Jan 23:27:33.205205 2022

యాడికిబోయినవ్‌ బిడ్డా....కండ్లకానొస్తలేవు..
మాయదారి కరోనంట....మసిజేత్తదంట...
గడపదాటొద్దురంటే... మాటిన్కబోతివి...
మూతిముక్కు గడ్డంగ గుడైన కట్టరంటే...
దండీలుబస్కీలు తీసెటోన్ని...నాకే అడ్డులేందంటివి
తాకి సంపుతదంటే... నన్

నమ్మకం కలిగిద్దాం
Sat 08 Jan 23:24:36.973227 2022

మిన్ను విరిగి మీద పడ్డట్టు
కంటికి కనిపించని ఒమీక్రాన్‌ మహమ్మారి
మళ్ళి బుసలు కొడుతూ
మత్యువై తరుముతుంటే

జీవులు ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు తీస్తుంటే
దారి కాచి దానవత్వం చూపనేల

ఎండకు నీడ తోడుగున

కోరస్‌
Sat 01 Jan 23:08:42.735115 2022

ఒక పోరాటాన్ని రాజేయాలంటే
గత పోరాటాల తీరుతెన్నుల్ని అవలోకనం చేసుకోవాలి
లక్ష్యాన్ని గిరిగీసుకుని
లక్షణంగా ముందుకు సాగుతుండాలి
దీక్షలుంటాయి నిరీక్షణలుంటాయి
అవమానాలుంటాయి అడకత్తెరలో ఇరికించడాలుంటాయి
ప్రాణత్యాగాలుంటాయి పరి

''అడుగు'' విమానం !!
Sat 01 Jan 23:07:47.407823 2022

నా అడుగుల వెనక
మా తండ్రి అడుగులు
మా తండ్రి వెనుక
మా తాత అడుగులు
ఒకరి అడుగులు ఇంకొకరికి
మడమ తడబడని రాజ మార్గం !

మన ముందు వారి అడుగుల పై
మనం అడుగు పెట్టి నడుచుకునుడే
కాదు - సులభంగా పరుగెత్తుతూ పొవచ్

ఎదురీదుదాం!!
Sat 01 Jan 22:50:25.708592 2022

చేతి వేళ్ళ మీద లెక్కింప బడుతున్న అంకెలను తేదీలుగా మార్చుకున్న క్యాలెండర్‌ మట్టి గోడ మీద వేలాడుతూ కనబడని కాలాన్ని నెలలుగా విభజించి మనకు పరిచయం చేస్తుంది!

రెప్పపాటు సమయాన్ని
క్షణాలుగ లెక్కించే ఇంట్లోని
గంటల గడియారం వయ్యారం

పూలతోట
Sat 25 Dec 23:28:57.585339 2021

పూలతోట సువాసన వెదజల్లుతుంది
నీలి సాగరం వర్షాలు కురిపిస్తుంది
ఇతరుల మేలు కోసం జీవించడమే
జీవితం అంటే

వెలుగు నింపే సూర్యుడు
ఉదయించని రోజు
నీవే ఒక వెలుగువై సాగిపో
పూలు పరిచిన దారి అయినా
ముళ్లబాట అయినా

ఈ డప్పే ...
Sat 25 Dec 23:19:41.329165 2021

ఏ తల్లి కడుపున పుట్టిందో
నా కడుపుకింత అన్నం పెడుతుంది

బతికున్నోళ్ళను చిందేసి ఆడించింది
అయినోళ్లూ ఎవరు లేకపోయినా
సచ్చినోల్లనూ చివరిదాకా సాగనంపింది

చీకటి బతుకుల వెలుగు నింపమని
శివసత్తులతోటి శివతాండవం ఆడించ

మట్టి చేతులు
Sat 25 Dec 23:18:45.762143 2021

అతడి చెమటచుక్కలు నేలను ముద్దాడితేనే
బువ్వపూలు పూసేవి.
మన కడుపులో ఆకలి చల్లబడేది.
అతని పాదాలు మట్టిలోదూకి..
తనువంత నాగేటి సాళ్ళల్లో స్నానమాడితేనే..
వరి పైరులన్ని పురుడోసుకునేవి.
జనాల ఆకలిని తీర్చే గొప్ప విద్యను..

వర్ణిత వర్ణం
Sat 25 Dec 23:13:21.086959 2021

దేహ భాగాలకు గడియారపు ముళ్ళనతికించుకొని
నిర్వచించలేని దీర్ఘ మౌనాల మధ్య
మాటలకు సంకెలలు వేయబడుతున్నపుడు
బయటకు రాలేని అర్థవంతమైన భావనలు
నినదించే ప్రయత్నం
గతాల శోధనలో భవితకు వెలుగులందివ్వాలనుకునే
తపోదీక్షాపరులు

నీకై ప్రతిక్షణం....
Sat 18 Dec 23:29:28.95527 2021

ప్రియతమా
నా హదయమా
నను గెలిచిన సర్వస్వమా
నువ్వు చూడగలిగితే
నీ మనోనేత్రాలకు
నా అంతరాల్లో పొంగిపొర్లుతున్న
అవ్యక్త వేదన
స్పష్టంగా కనిపిస్తుంది....

నీవు వినగలిగితే
నీ మనసు సన్నిధికి
నా అన

ఇంత చోటివ్వు కన్నా!
Sat 18 Dec 23:22:20.169894 2021

హఠాత్తుగా అక్కున పెంచుకున్న చెట్టంత కొడుకు
అమ్మ పెట్టిన ముద్ద తప్ప
ఇంకేమీ రుచించని కొడుకు...
అమ్మ పోపు డబ్బాల్లో దాచుకున్న సొమ్ము నుంచి మొదలు పెట్టి
తాళి బొట్టులో కూడా వాటాల కోసం కాచుకునే కొడుకు
''అమ్మ మీద పాట'' ఎక్కడ విన్

బాల్యపు భావాలు
Sat 11 Dec 23:29:43.688968 2021

దోసిట్లోంచి ఇసుకలా జారిపోయే బాల్యపు రేణువులను/
అణువణువునా హత్తుకొని అరచేతిలో పట్టేసి/
ప్రియంగా చేసిన పిట్ట గూటిలో పదిలంగా పొదువుకున్నా/
తీరిక లేని జీ(వి)తపు ఆటలో నుంచి/
తీర్పాటం చేసుకొని తరచూ తనివితీరా తడుముతుంటా/
బాల్య

గిరి ప్రదక్షిణ !
Sat 11 Dec 23:19:51.005161 2021

భూగోళమంతటా గిరులే !
చిన్నవి.. పెద్దవి.. ప్రాచీనమైనవి.. పవిత్రమైనవి..
కాలం తొలి సంతకం నాటిPangea నుండి
Continental Drift పుణ్యమా అని
ఖండాలంతటా గిరుల శ్రేణులే...

అచలాలు, అద్రులు, కొండలు, గుట్టలు,hills
పహాడ్&zwn

యూటర్న్‌! ..
Sat 04 Dec 23:30:22.663442 2021

మిన్నును చూస్తుందా స్థలం
రేయిపగలు రెప్పవాల్చని ఆ చూపులు
పచ్చని కాపురానికి కలలధామంగా వెలసి చల్లని నీడయ్యింది
కోరికలు,ఆశలు, ఆనందాల కలబోతగా అందాలగూడయ్యింది
కళకళలాడుతుంది ఆ మమతల లోగిలి...
కాలం కదిలింది క్షణమాగని పెదవాగునదిలా

స్వప్నాల సరిహద్దుల్లో..
Sat 04 Dec 23:23:58.083616 2021

ఆలోచనల ముసురు
అనవరతంగా కసిదీరా దాడిచేసి
నీ జ్ఞాపకాల జడి
తడిని ఆరనివ్వకపోతే..

నా జ్ఞాపకాల గుండె గడిలో
నువ్వు లోపలుండి పోయి గడియ
పెట్టుకున్నందున బైటి నుండి
ప్రవేశాలన్ని నిషిద్ధమయ్యాయి

ఆలోచనసంద్

ఎగిరిపోయిన ఎర్రవల్లి
Sat 04 Dec 23:22:59.895689 2021

ఎర్రవల్లి పేర్లోనే ఏదో శక్తుంది
ఎరుపెక్కిన ఎద లోతుల గాయముంది!
ఎర్రవల్లి ఊర్లోనే ఏదో మహత్తుంది ఎత్తైన కొండల్లో పూచిన
ఎర్ర మందారమది!

ఇక్కడి మట్టిలోనే మొరటుతనముంది
ఈడి నీళ్ళళ్ల సల్లదనముంది
వీచే గాలిల పెంకితనముం

ముద్దకు దండం పెట్టాలి!
Sat 04 Dec 22:55:32.42306 2021

కవికి దండం పెడితే
కవి పద్య పాదానికి పెట్టినట్లే
తినే ముద్దకు పెడితే రైతు పాదాన్ని ముద్దాడినట్లే!

వ్యవసాయం ఎప్పటికీ
వ్యాపారం కానే కాదు
అది మానవీయ కార్యకలాపం!

బలిసిన రాజ్యం నెత్తిన
మట్టి పాదాలు తొక్కితే

పిడికిలి
Sun 28 Nov 04:50:03.189185 2021

అవును వారు గెలిచారు......
ఎత్తిన పిడికిలి దించకుండా
అయిన వారికి దూరంగా
అన్నపానీయాలు మరచి
ఎండావానలను స్వాగతిస్తూ
గడ్డకట్టుకుపోయే చలికే వణుకు పుట్టించి
ముంచెత్తే వానలపై ఆకాశ గొడుగును ఎక్కుపెట్టి
ఎర్రటి ఎండల్లో సూర్

అస్తిపంజరాలు
Sun 28 Nov 04:47:32.40068 2021

మానవ జాతి మొత్తం జీవన యుద్ధంలో ఓడిపోయి అంపశయ్యపై ఆఖరి క్షణాల కోసం ఎదురు చూసే గాయపడ్డ దేహంలామౌనంగా కళ్ళు తెరిచిచూస్తోంది

స్వార్ధపు సాలీడు అల్లిన దురాశల దారాల మధ్య చిక్కుబడిన సమాజం నేడు అచేతనంగా బూజుపట్టిన స్మశాన వాటికలా అగుపడుతోంది

వారొకమారు
Sun 28 Nov 04:47:05.927185 2021

కొందరు మాట్లాడినపుడల్లా
ఒక మంచి ఆలోచనావిత్తును
మదిమడిలో నాటిపోతారు
మాటలు కలబోసుకున్నపుడే కాదు
ఊహల్లోకి వచ్చినపుడల్లా
మమకారపు మేఘపు చినుకులను
వర్షించి వెడతారు
ఎన్నో ఖాళీ క్షణాలను డొల్లబారినతనాలను
ఆత్మీయతత

కిసాన్‌ కో సలాం
Sun 28 Nov 04:43:10.36421 2021

భారత రాజధాని నడిబొడ్డున..
అన్నదాతల ఆందోళనలు..
మండీలపై ముంతపొగ పెట్టి..
బక్క రైతును కార్పొరేట్ల దయకు..
వదిలేస్తారన్న రేపటి రైతు భీతితో..
అడ్డగోలు శాసనాల్ని వ్యతిరేకిస్తూ..
మడమతిప్పని అన్నదాత పట్టు..
సమైక్య నిరసనో

శ్వాసిస్తూనే ఉంటాను....!
Sat 20 Nov 22:57:41.776709 2021

ప్రియా...
అపురూపమైన నీ ప్రేమ
నా సొంతమవుతుందని
మనసారా ఆశపడ్డాను .....
మనసు నిండుగా ఆశించాను....

నా గుండె నిండిన ప్రేమతో
నీ సుకుమార చేయిని
నమ్మకం పంచి ఇస్తూ నా చేతుల్లోకి తీసుకున్నాను....

కానీ

సామాన్యుడి కల
Sat 20 Nov 22:53:52.222926 2021

సామాన్యుడి కలలు
కుట్టేవే కాని భుజం తట్టేవి కావు.
అంతులేని ఆకాశంలో
చావని ఆశలపై దుఃఖ మేఘాలు ఊరేగుతాయి.
రెండుపూటలా తిండి, రెండు బట్టగుడ్డలు
తలదాచుకోవడానికి ఓ చిన్న గూడూ-
ఇంతకు మించి సామాన్యుడు కలలేం కనగలడు.

ఇపుడేది తప్పుకాదు
Sat 20 Nov 22:34:53.858563 2021

అబద్దం
హత్య
మోసం
ఆక్రమణ
ఏదీ తప్పుకాదు
ఎర్రటోపి
నల్లకోటు
నాయకుల
అండ దండిగా వుంటే
ఏదీ తప్పుకాదు
అప్పులు చేసి
పారిపోవటం
అత్యాచారాల చేసి
చంపేయటం
ఏదీ తప్పుకాదు
చెవులు మూసు

బతుకు వేట
Sat 13 Nov 23:15:47.996213 2021

లతనువును ధనస్సులా మార్చి
గమ్యాన్ని విల్లులా చేసుకొని..
బతుకు వేటకై బయలుదేరుతాడు.
వాడి ఆరాటం నిఖార్సైన పోరాటం
నాలుగు మెతుకులకై సాగే బతుకు ప్రయాణం.
అలుపెరుగని కాలువలా సాగే కార్మికుడు వాడు.
వానకట్టలెన్ని అడ్డువచ్చినా...అ

మట్టి పాదం గట్టి పాఠం
Sat 13 Nov 22:45:50.335884 2021

జడిగానిదీ జడివానదీ
విడదీయరాని సంబంధం

చిత్తడిన నాటిన విత్తనానితో
చినుకు రేపిన మట్టి వాసనది
సుతిమెత్తని మధురాతి మధుర ప్రీతి పాత్ర చైత్ర బంధం

తన చెమట గంధపు తడితో
చిరు మొక్కల పసి ముఖాలను తుడుస్తూ....
నలు

గాలి పాట !
Sat 13 Nov 22:39:18.430637 2021

నిశబ్దం నిదురపోయినప్పుడల్లా
గాలి ఈలలు వేస్తూ
హుషారుని ఉసుగొల్పుతుంది
దిగులుతనంతో డీలా పడ్డ చెట్టును
గుంబనంగా ఆకుల్ని స్పశిస్తూ
ఆశల గీతాల్ని ఆలపిస్తుంది
చికాకు మనసుకు
తుమ్మెద ఝుంకారమై
అలా,అలా అలల్లా
మెత

బతుకు వేట
Sat 13 Nov 22:38:18.341777 2021

తనువును ధనస్సులా మార్చి
గమ్యాన్ని విల్లులా చేసుకొని..
బతుకు వేటకై బయలుదేరుతాడు.
వాడి ఆరాటం నిఖార్సైన పోరాటం
నాలుగు మెతుకులకై సాగే బతుకు ప్రయాణం.
అలుపెరుగని కాలువలా సాగే కార్మికుడు వాడు.
వానకట్టలెన్ని అడ్డువచ్చినా...అల

నా ప్రేయసి
Sat 06 Nov 23:23:13.835675 2021

ఇరవైనాలుగు గంటలు
నన్ను గిల్లుతూనో ,గిచ్చుతూనో
నా చుట్టూ తిరిగే పద్యం
ప్రేయసే కదా!

నాలోని ఆనందాన్ని
పచ్చని పైరులాంటి వాక్యంలోకి
నాలోని బాధను
నెర్రెలిచ్చిన భూమిలాంటి
పదాల్లోకి
పట్టి చూపిస్తూ<

Next
  • First Page
  • Previous
  • ...
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.