నవతెలంగాణ - హైదరాబాద్ : ఆఫ్రికా దేశం బోట్స్‌వానాలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 8 జిల్లాల్లో 23 ఏనుగుల వేటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వేటలో లభించిన ఏనుగుల మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏనుగుల వేట వన్యప్రాణుల సంరక్షణకు విఘాతం కలిగిస్తుందని జంతు హక్కుల నేతలు విమర్శిస్తున్నారు. అయితే పంటలు, ఆస్తులకు ఏనుగుల వల్ల నష్టం జరుగుతోందని.. వాటి జనాభా నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగానే వేటకు అనుమతిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. బోట్స్‌వానాలో సుమారు 1.30 లక్షల ఏనుగులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.






కామెంట్‌లు (0)