బ్రసిలియా : బ్రెజిల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించారు. బ్రెజిల్ అధ్యక్ష పదవికి నాలుగోసారి ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నిర్బంధంలో ఉన్న మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో కుమారుడు ఫ్లావియో బోల్సొనారోతో ఆయన తలపడుతున్నారు. కాగా బెట్టింగ్ క్రీడలు, ఆన్‌లైన్ కేసినోలపై నిషేధం విధించే ఉత్తర్వుపై లూలా శుక్రవారం సంతకం చేశారు. బ్రెజిల్‌లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ పరిశ్రమను మాజీ అధ్యక్షుడు మిచెల్ టెమర్ హయాంలో 2018లో చట్టబద్ధం చేశారు. దీంతో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు బానిసలైన పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ పరిశ్రమను ‘క్యాన్సర్’గా లూలా అభివర్ణించారు. ఆ ట్యూమర్‌ను తొలగించాలి లేదా నాశనం చేయాలి అని చెప్పారు. కాగా లూలా తీసుకున్న నిర్ణయాన్ని 120 రోజుల్లోగా చట్టసభ ఆమోదించాల్సి ఉంటుంది. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలకు వచ్చే వారం తొలి రౌండ్ పోలింగ్ జరుగుతుంది.
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై లూలా నిషేధం
58 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)