-గోడప్రతుల ఆవిష్కరణలో మాతంగి అశోక్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 9న వరంగల్ పట్టణంలో కాన్షీరాం వర్థంతి సందర్భంగా తలపెట్టిన బహుజన రాజ్యాధికార సమర భేరి సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాతంగి అశోక్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బహుజన రాజ్యాధికార సమర భేరి గోడప్రతులను మాతంగి అశోక్, పార్లమెంట్ ఇంచార్జీ అక్కి బాలకిషన్, కరీంనగర్ జిల్లాధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ హజరై మండల బీఎస్పీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. నాయకులు కొంపెల్లి పరుశురాం, కుమ్మరి సంపత్, నిషాని సురేశ్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)