Magazines

ఎన్నికల్లో ముదిరాజులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 

1 గంట క్రితం

govt
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు ఇచ్చిన హామీలను, ప్రభుత్వం ఆమాలు చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలుపుల హరినాద్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం ముదిరాజ్ సంఘం సమావేశం శ్రీ కనకదుర్గ దేవాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ హక్కుల సాధన కొరకు రాష్ట్రంలోని సంఘాలన్నీ ఏకమై ఉద్యమిస్తామన్నారు.

హైదరాబాదులో నిర్వహించు సభకు సన్నాహకం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మచ్చకారులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు , స్కూటీలు, వలలు, చేపల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం అమలు కాలేదని విమర్శించారు. మత్స్యకారులకు భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్