Magazines

ఎమ్మెల్సీ‌ పోరుకు పార్టీలు సై

1 గంట క్రితం

Parties agree on MLC fight
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్‌ ‌ముందంజ
బీఆర్‌ఎస్‌ ‘బీసీ’ మంత్రం
నల్లగొండలో ఓసీ, హైదరాబాద్‌‌లో బీసీకి అవకాశం
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ఓట్ల నమోదుపై ప్రధానంగా దృష్టి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. ఒకవైపు ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక, ఇంకోవైపు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నా యి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రెండు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశమున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల కోసం అభ్యర్థులను పోటీలో నిలబెట్టేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం అధికార కాంగ్రెస్‌‌కు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానున్నాయి. అందుకే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు సమాయత్త మవుతున్నాయి. ప్రధానంగా ఓట్ల నమోదుపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ ‌ముందంజలో ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌‌నగర్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్‌‌రెడ్డి, నల్లగొండ-వరంగల్‌-‌ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి పేర్లను ఖరారు చేసి ప్రకటించింది. దీంతో ఇతర పార్టీలపై ఒత్తిడి పెరిగింది.


​బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై ఉత్కంఠ

కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనే చర్చ జరుగుతున్నది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌‌నగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీసీ అభ్యర్థికి, నల్లగొండ-వరంగల్‌-‌ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓసీకి కేటాయించే అవకాశమున్నట్టు తెలిసింది. ఈ సామాజిక నేపథ్యం ఆధారంగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ ‌నుంచి కాసాని వీరేశం, నాగేందర్‌‌గౌడ్‌, తలసాని సాయికిరణ్‌ ‌యాదవ్‌ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు రిటైర్డ్‌ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ కుమార్‌ ‌పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఏనుగుల రాకేశ్‌‌రెడ్డికి మరోసారి టికెట్‌ ఇచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. బీజేపీ కూడా అభ్యర్థుల ఖరారులో నిమగ్నమైంది. నల్లగొండ నుంచి జనసేన పార్టీ తరఫున గడల శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తును ప్రారంభించాయి. ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

​ఇది మినీ అసెంబ్లీ సమరం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలు మినీ అసెంబ్లీని తలపించే విధంగా ఉండనుంది. అందుకంటే ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 20 జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ ‌నియోజకవర్గం పరిధిలో తొమ్మిది జిల్లాల్లో ఆరు ఎంపీ స్థానాలు, 37 అసెంబ్లీ స్థానాలున్నాయి. నల్లగొండ నియోజకవర్గం పరిధిలో 11 జిల్లాల పరిధిలో ఐదు ఎంపీ స్థానాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 11 ఎంపీ స్థానాలు, 71 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం పడుతుంది.


​పట్టభద్రులు ఎటువైపు?
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. వారు ఎటువైపు ఉన్నారనేది ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. అభివృద్ధి, సంక్షేమం చేశామంటూ కాంగ్రెస్‌, ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బీఆర్‌ఎస్‌ ‌ప్రచార అస్ట్రాలుగా ఉండనున్నాయి. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదనీ, నిరుద్యోగులను కాంగ్రెస్‌ మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తున్నది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 67 వేల కొలువులను భర్తీ చేసిందనీ, నవంబర్‌ ‌నుంచి రాజీవ్‌ ‌యువ వికాసం అమలు చేస్తుందని చెప్తున్నది. పట్టభద్రులు కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఉంటారా?, బీఆర్‌ఎస్‌‌ను ఆదరిస్తారా?అనేది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదు. అందుకే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్