నవతెలంగాణ-హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్‌లో మూడుసార్లు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్, మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో విధించిన సస్పెన్షన్ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 42 ఏళ్ల నీరజ్ యాదవ్ మృతిని భారతీయ పారా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎస్ సత్యనారాయణ ధృవీకరించారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)