నవతెలంగాణ - హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కీలక సూచన చేసింది. రెండేళ్లకు పైగా లావాదేవీలు జరగని, ఏడాదికి పైగా జీరో బ్యాలెన్స్‌తో ఉన్న ఖాతాదారులు వెంటనే KYC అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఖాతాలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఖాతాదారులు ఆధార్‌తో సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. అలాగే యోనో యాప్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)