Magazines

సీజేపీ ప్రశ్నలకు అన్నామలై మద్దతు

1 గంట క్రితం

Annamalai supports CJP's questions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వుయ్‌ ది లీడర్స్‌’ వ్యవస్థాపకుడు అన్నామలై సీజేపీ నిరసనలపై స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) లేవనెత్తుతున్న ప్రశ్నలకు మద్దతు తెలిపారు. అయితే నిరసన తెలిపే విధానంతో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నిరసనకారులను అరెస్టు చేసి ఎక్కువకాలం జైల్లో ఉంచడం వల్ల సీజేపీ నేతలు మరింత బలపడతారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల వైఖరిని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్