నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఏడాది మేలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ రైలు 250 కి.మీ వేగంతో నడుస్తుందన్నారు. అహ్మదాబాద్- ముంబయి మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సూరత్ - బిలిమొరా సెక్షన్‌లో 50 కి.మీ మేర రైలు కారిడార్ పూర్తయిందని, ఇదే వేగంతో అన్ని సెక్షన్లలో నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఏప్రిల్ నాటికి బుల్లెట్ ట్రైన్ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్న ఆయన.. 2029 నాటికి బుల్లెట్ ట్రైన్ థానే వరకు చేరుతుందని చెప్పారు.
వచ్చే ఏడాది మేలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్: అశ్వినీ వైష్ణవ్
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)