నవతెలంగాణ-హైదరాబాద్ : పండుగ సీజన్ కావడంతో నాన్‌వెజ్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ ప్రాంతాల్లో చికెన్, గుడ్ల ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.275, గుడ్ల డజను రూ.80 వరకు పలుకుతోంది. హైదరాబాద్, కరీంనగర్ జోన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు.
పండుగ వేళ పెరిగిన చికెన్ ధరలు..
19 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)