Magazines

సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నవంబర్ 14 వరకు బంద్

1 గంట క్రితం

Saudi Arabia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రాకపోకలపై మరోసారి ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని కీలక గమ్యస్థానాలైన జెడ్డా, రియాద్, దమ్మామ్‌లకు రాకపోకలు సాగించే అన్ని విమాన సర్వీసులను వచ్చే నెల నవంబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం 'ఎక్స్' వేదికగా పేర్కొంది.


నవంబర్‌ 14 వరకు ప్రయాణాల కోసం టికెట్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు రీ-బుకింగ్ కోసం (నవంబర్‌ 29 వరకు ప్రయాణించేందుకు) ఒకసారి అవకాశం కల్పించనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. బుకింగ్‌ క్యాన్సిల్‌ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయి రీఫండ్‌ పొందవచ్చని తెలిపింది. నెట్‌వర్క్‌ల వ్యాప్తంగా ఉన్న కాంటాక్ట్ సెంటర్లు మరియు సిటీ బుకింగ్ కార్యాలయాల ద్వారా ప్రయాణీకుల రీషెడ్యూలింగ్‌ను సులభతరం చేయడానికి కస్టమర్ సహాయక బృందాలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్ హామీ ఇచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్