Magazines

అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వీడ్కోలు

15 గంటల క్రితం

Glenn Maxwell bids farewell to international cricketbids farewell to international cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. అయితే బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున కొనసాగనున్నాడు. 2027-28 సీజన్‌ వరకు ఆ జట్టుతో అతడి ఒప్పందం ఉంది. గతేడాది జూన్‌లోనే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అయితే ఆ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్‌ దశను దాటలేకపోయింది.


ఫిబ్రవరిలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌ అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన మ్యాక్స్‌వెల్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రిటైర్మెంట్‌ నిర్ణయంపై మ్యాక్స్‌వెల్‌ స్పందిస్తూ.. ప్రపంచకప్‌కు ముందు, తర్వాత జట్టు యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలన్న జట్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన సొంత మైదానమైన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో చివరిసారిగా ఆడే అవకాశం వస్తే బాగుండేదని, అయితే జట్టు భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటున్నానని వెల్లడించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్