Magazines

అతి త్వరలో ఆ రికార్డును అధిగమిస్తారు: యువరాజ్ సింగ్

1 గంట క్రితం

Yuvraj Singh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అతి త్వరలో తన రికార్డును అధిగమిస్తారని మాజీ ఇండియాన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ సమయం ఎంత దూరం లేదని ముంబాయిలోని తన న్యూట్రిషన్ సప్లిమెంట్ 'ప్రోటోకాల్32' ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో దీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆట తీరుతో ఇండియాన్ క్రికెటర్ పేరుతో ఆ రికార్డును తిరగరాయనున్నారు.ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల రికార్డు ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని, త్వరలోనే అది బద్దలవుతుందని యువరాజ్ సింగ్ భావించారు.


2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా యువరాజ్ సింగ్ నిలిచారు. ఆ తర్వాత వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్, నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఐరీలు ఉన్నా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా యువీ పేరు చెక్కుచెదరలేదు.


కాగా, మంగళవారం హెన్రీ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భాగంగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో అభిషేక్ 38 బంతుల్లో 113 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ తన మోంటార్ యువీ రికార్డులను చేరుకోవడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్