Magazines

కోల్‌కతా తొక్కిసలాట..మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

18 అక్టోబర్, 2026

stampede
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని చోర్‌బగాన్‌ సర్బజనీన్‌ (సర్వజనీన) దుర్గా మండపంవద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 19మంది మృతిచెందారు. ఈ క్రమంలో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహక కమిటీ సభ్యులతో సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నిర్లక్ష్యం వల్ల నిర్వహణ చర్యల్లో లోపాలు చోటు చేసుకొన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన 25మందిని మెరుగైన చికిత్స కోసం కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం నేపథ్యంలో చోర్‌బగాన్‌ సర్బజనీన్‌ (సర్వజనీన) దుర్గా మండపాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలలోని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై దర్యాప్తునకు కలకత్తా హైకోర్టుకు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT), ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సిట్‌లో ఎస్‌టీఎఫ్‌, సీఐడీ సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్