Magazines

మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్‌..సీఎం సొంత ప్రాంతంలో కాంగ్రెస్‌ విజయం!

51 నిమిషాల క్రితం

BJP vs Congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ ఫలితం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సొంత ప్రాంతంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేతలకు ఈ గెలుపు సమాధానంగా మారింది. ప్రధాని మోడీ పోస్టును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ మూడు స్థానాలను గెలుచుకుంది. అధికార మహాయుతి కూటమి రెండు స్థానాలకే పరిమితమైంది. 

నాగ్‌పూర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజిత్‌ వంజారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ కోహ్లేను 3,271 ఓట్ల తేడాతో ఓడించారు. ఓట్ల లెక్కింపు 40 గంటలకు పైగా సాగిన తర్వాత గురువారం ఫలితం వెలువడింది. బీజేపీకి సంప్రదాయంగా బలమైన స్థానంగా ఉన్న నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫడ్నవీస్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రచారం చేసినా బీజేపీకి ఓటమి తప్పలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్