నవతెలంగాణ-హైదరాబాద్: సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి జరిగింది. ట్యాంకు ఢీకొట్టడంతో దాని కింద నలిగి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ సంఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Army Soldiers Killed) శనివారం సైనిక శిక్షణలో భాగంగా సుమారు 32 ట్యాంకులతో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ధూళి గాలిలోకి లేచింది.వారిని వెంటనే హిసార్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మరోవైపు ఆర్మీ అధికారులతో పాటు హిసార్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.





కామెంట్లు (0)