Magazines

సోనమ్‌ వాంగ్‌చుక్ కు నోటీసులు

8 గంటల క్రితం

Notices issued to Sonam Wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ పాఠశాలకు లడఖ్‌ యంత్రాంగం నోటీసు జారీ చేసింది. వాంగ్‌చుక్‌ స్థాపించిన హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అల్టర్నేటివ్‌ (హెచ్‌ఐఎఎల్‌) కు చెందిన డెసర్ట్‌ పాఠశాలలో హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. లెహ్‌లోని తహసీల్దార్ కార్యాలయం ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నోటీసును హెచ్‌ఐఎఎల్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ, వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి జె. ఆంగ్మోకు ఈ నోటీసులు పంపారు. లేహ్‌లోని డెసర్ట్ ఫ్లవర్ స్కూల్‌లో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన సమ్మతి, అనుమతులు లేదా ఆమోదాలు పొందకుండానే తరగతులు, ఇతర కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని యాజమాన్యానికి సమాచారం అందినట్లు నోటీసు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్