నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వినూత్న రీతిలో నిరసన సెగ తగిలింది. గతంలో తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు బావార్చి హోటల్ వద్ద నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ ఫొటోను ఓ కుర్చీకి తగిలించి, ఆయన కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రదర్శించారు. బావార్చికి వచ్చి బిర్యానీ తింటూ ఉద్యోగాల గురించి మాట్లాడాలని సెటైర్లు వేశారు.
అయితే కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ చేరుకోవడంతో ఇరు వర్గల మద్య తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో బావార్చి హోటల్‌ను మూసీవేశారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




కామెంట్‌లు (0)