Magazines

ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ రాజీనామా

5 గంటల క్రితం

Resignation of MP Aga Syed Ruhullah Mehdi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ మంగళవారం తన పార్లమెంటరీ సీటుకు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి 26వ వర్ధంతి రోజున ఆయన ఈ ప్రకటన చేశారు. బుద్గామ్‌లోని బెహెష్త్-ఎ-జెహ్రా పార్కులో భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. జేకేఎన్‌సీ తమ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో లేదా కనీసం వాటిపై చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమైందని మెహదీ ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన నిర్ణయంతో ఒక్కసారిగా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్