నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 22 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో 2027 జనవరి 4 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 కాగా, ఒకసారి ఫెయిలైన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులకు అదనంగా రూ.60 ఫీజు ఉంటుందని అధికారులు తెలిపారు.
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..
44 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)