Magazines

నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరు మృతి

12 గంటల క్రితం

Two helicopters collide in Nepal, one dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లోని సోలుఖుంబు ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మౌంట్‌ ఎవరెస్ట్‌ వెళ్లే మార్గంలోని హెలిప్యాడ్‌ వద్ద రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ విదేశీయుడు మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.ఫిష్‌టెయిల్‌ ఎయిర్‌, డైనాస్టీ ఎయిర్‌ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఉదయం 8.11 గంటల సమయంలో ల్యాండింగ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్