Magazines

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పు

19 నిమిషాల క్రితం

West Bengal State Name Change
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మారనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇకపై ‘పశ్చిమ బంగా’గా మార్చుతూ తీర్మానం చేసింది. ఇంగ్లీష్‌లో కూడా ఇకపై 'పశ్చిమ బంగా' (Paschim Banga)గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రం పేరును మార్చడం వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి సువేందు అధికారి పేర్కొన్నారు. 1947లో దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ ఏర్పడిన తీరును, ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


"ఇంగ్లీష్‌లో కూడా పశ్చిమ బెంగాల్ అనే పదానికి బదులుగా 'పశ్చిమ బంగా' అనే రాయాలి. ఇది రాష్ట్ర ఏర్పాటు చరిత్రతో ముడిపడి ఉన్న అంశం. డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తర్వాత, దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. అక్కడ పార్లమెంట్ ఆమోదం పొందాక ఇది చట్టబద్ధమవుతుంది" అని ఆయన వివరించారు. ఇటీవల కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్పు చేసిన విషయం తెలిసందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్