Magazines

బాసరలో మూల నక్షత్రంకు పటిష్ట బందోబస్తు

1 గంట క్రితం

Tight security
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ, ఎఎస్పీ

నవతెలంగాణ - ముధోల్
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈనెల 16న మూల నక్షత్రం కార్యక్రమం సందర్భంగా పటిష్ట పోలీసు భద్రత కోసం పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది . ఇందులో భాగంగా బందోబస్తు ఏర్పాట్లను, నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఎఎస్పీ పత్తిపాక సాయికిరణ్ బుధవారం రాత్రి బాసరను సందర్శించారు. ముందుగా బాసర ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లు, గోదావరి వద్ద బందోబస్తు చర్యల గురించి పలు విషయాలను ముధోల్ సీఐ రవీంద్ర నాయక్, బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ ను అడిగి తెలుసుకున్నారు.


దసరా నవరాత్రులతో పాటు, మూల నక్షత్రం కావడంతో దేశ నలుమూలల నుండి యాత్రికులు వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం తరిలి రానున్నారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, నిర్మల్ అడిషనల్ ఎస్పీ, భైంసా ఎఎస్పీ ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. బాసరగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ పోలీస్ మీ పోలీసు అని వారు పేర్కొంటున్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్