నవతెలంగాణ-సంగారెడ్డి
ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన సంగారెడ్డి పట్టణం 13వ వార్డు పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ కి చెందిన" మేఘన శ్రీ" నీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ.. లక్ష్మీ నగర్ కాలనీ లో ఉండే టీచర్ విజయానంద్ స్వరూపల పెద్ద కూతురు మేఘన శ్రీ గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడం లక్ష్మీ నగర్ కాలనీకి గర్వకారణమని, ఇప్పటికే కాలనీలో నలుగురు మెడికల్ సీట్లు సాధించడం ఇప్పుడు మేఘన శ్రీ కి కూడా సీటు రావడం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ మెడికల్ సీట్ పొందిన మేఘన శ్రీ వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతర పిల్లలు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉందన్నారు.. మేఘన ఇతర మెడికో స్టూడెంట్స్ పేదవారికి సేవ చేసేలా చూడాలని ఆయన కోరారు.. మేఘనను కాలనీవాసులందరూ అభినందించారు.. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ నాయకులు జగదీష్, రవీందర్, శివ, ప్రవీణ్ హరి సింగ్,లక్ష్మయ్య మరియు కాలనీవాసులు పాల్గొన్నారు..







కామెంట్‌లు (0)