Magazines

కంది పంటపై రుద్రూర్ శాస్త్రవేత్త అవగాహన

1 గంట క్రితం

Kandi Crop
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

మండలంలోని మేనూరు గ్రామంలోని రైతు వేదికలో బుధవారం కె వి కె రుద్రూర్ శాస్త్రవేత్త హిందూధర్ రెడ్డి కంది పంటలో సస్యరక్షణ చర్యల గురించి అవగాహన కల్పించారు. ఈ మేరకు WRG-97 రకం కంది పంట సస్యరక్షణ చర్యల గూర్చి వివరంగా వెల్లడించారు. అలాగే రైతులకు కంది పంటకు పిచికారి కోసం వేప నూనె పంపిణీ చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. యాసంగిలో సాగు చేయబోయే పంటల యాజమాన్య పద్ధతులు, విత్తన సబ్సిడీ వివరాలు, అలాగే ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్, ఏఈవో విశాల్ గౌడ్. రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్