నవతెలంగాణ - భీంగల్
భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో (ACP) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఛాంబర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కోర్టులో నేటి నుంచి కేసులకు సంబంధించి సాక్ష్యాల నమోదు ప్రక్రియ (ఎవిడెన్స్ ప్రొసీడింగ్స్) ప్రారంభమైంది. నూతన కోర్టులో సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో భీంగల్ ప్రాంత ప్రజలు, న్యాయవాదులు, కక్షిదారులకు మరింత సౌకర్యం కలగనుంది.
స్థానికంగానే న్యాయపరమైన సేవలు అందుబాటులోకి రావడంతో సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. అలాగే న్యాయపరమైన కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం, సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడం న్యాయస్థాన అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలిచింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, భీంగల్ ఎస్సై తిరుపతి, మోర్తాడ్ ఎస్సై రాము, న్యాయవాదులు, గజ్జెల చైతన్య, సుర సురేష్, ఆవరీ రమేష్, పొడేటి శంకర్, కోర్టు కానిస్టేబుల్ రమణ, రాజు, అనిల్, హరి, ఎర్గట్ల సురేష్,తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)