- కలెక్టర్,డిఈఓలకు ఎబివిపి నాయకుడు ప్రజావాణిలో ఫిర్యాదు
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలం ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్,పిఈటి పిఎంశ్రీ నిధుల్లో అక్రమాలకు పాల్పడుతూ,అలాగే విద్యార్థినుల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తూ,పాఠశాల వాతావరణాన్ని పాడుచేస్తున్న అవుట్‌సోర్సింగ్ వ్యాయామ ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించకుండా, రాజకీయ బలంతో వేరే పాఠశాలకు బదిలీ చేయడానికి సహకరిస్తున్న ప్రిన్సిపాల్, ఎంఈలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,డిఈఓలకు ఎబివిపి రాష్ట్ర కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు పాఠశాలలో పరిపాలనాపరమైన అక్రమాలు,బాధ్యతారహితమైన వైఖరి,విద్యార్థినుల భద్రతకు భంగం కలిగిస్తున్న పరిణామాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,ఈ విషయంలో వచ్చే 48 గంటల్లో స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే, విద్యార్థుల భద్రత కొరకు ఎబివిపి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.





కామెంట్‌లు (0)