Magazines

​వాతావరణ మార్పులతో తీవ్ర నీటి ఎద్దడి రానుంది

2 గంటల క్రితం

​Climate change
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

- ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి

- మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ 

- కమిషనర్ కోండ్ర నరసింహ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని, ​ఈ నేపథ్యంలో సత్తుపల్లి పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని మున్సిపల్ పాలకవర్గం, మున్సిపల్ అధికారులు కోరారు. సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ అధ్యక్షతన చైర్ పర్సన్ ఛాంబర్ లో నీటి సరఫరాపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్ రెహానా కమల్, కమిషనర్ కోండ్ర నరసింహ మాట్లాడారు. ​నీటిని వృథా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ​వాటర్ సప్లై సిబ్బందికి నీటి పొదుపు చర్యలపై పలు కీలక సూచనలు చేశారు.


ప్రతి ఇంటి యజమాని నీటిని అవసరానికి తగినంత మాత్రమే వినియోగించాలని, ఉచితంగా వచ్చే నీటిని ఏమాత్రం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. వీధుల్లో లేదా పరిసరాల్లో నీటి పైపుల లీకేజీలు ఉంటే వెంటనే మున్సిపల్ ​అధికారులకు సమాచారం అందిస్తే త్వరితగతిన నీటి వృధాను అరికట్టడానికి వీలవుతుందన్నారు. ​ప్రతి ఇంటి నీటి కనెక్షన్‌కు తప్పనిసరిగా కంట్రోల్ వాల్వ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ​వాడకం లేనప్పుడు వాల్వ్ మూసివేసి నీటి వృథాను అరికట్టాలని సూచించారు. నిబంధనలు పాటించని కనెక్షన్లను వాటర్ సప్లై సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని స్పష్టం చేశారు.


​నియమాలు ఉల్లంఘిస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైన పక్షంలో నిబంధనల మేరకు జరిమానాలు కూడా విధిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నీటి పన్ను బకాయిలను ప్రజలు వెంటనే చెల్లించాలి, ​సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.​నీటి సంరక్షణ అనేది మనందరి సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.‌ నీటిని ఈరోజే నుంచే కాపాడుకుందామని, భవిష్యత్తు తరాలకు సురక్షితంగా నీటిని అందిద్దామన్నారు. ​ప్రజల పూర్తి సహకారమే నీటి సంరక్షణకు పునాది అని అన్నారు.‌ ఈ సమావేశంలో మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్