Magazines

దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

12 నిమిషాల క్రితం

Deeksha Divas
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- బీఆర్ఎస్ మండల సమన్వయకర్త జూపల్లి కోదండ వెంకట రమణారావు పిలుపు

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటానికి గుర్తుగా ఈ నెల 29 న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ సమన్వయకర్త జూపల్లి కోదండ వెంకట రమణారావు బుధవారం పిలుపునిచ్చారు. 


పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న సాయిరంగా ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్