నూతన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి
నవతెలంగాణ - భీంగల్
శుక్రవారం భీంగల్ లోని తహశీల్దార్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ టీం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఇన్ఫోరసెమెంట్ టీం సభ్యులు పట్టణంలో నిర్మిస్తున్న అనధికార కట్టడాలను అధికారులు ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిమెంట్ టీం హెడ్ తహశీల్దార్ మాట్లాడుతూ.. కొత్తగా ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్న పట్టణ ప్రజలు మున్సిపల్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. లేనియెడల తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఇన్స్పెక్షన్ లో తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆర్ & బి ఏఈ, ఫైర్ ఆఫీసర్ తదితర అధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)