Magazines

రేపు కందుకూరులో 'హెటిరో' ఉచిత వైద్య శిబిరం

2 గంటల క్రితం

Hetero' free medical camp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

నవతెలంగాణ-సత్తుపల్లి 

​రేపు (బుధవారం) వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి నేతృత్వంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వైద్య శిబిరంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభిస్తారు.


డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి నిర్వహణలో హైదరాబాద్ సింధు హాస్పిటల్ వారి  ఆధ్వర్యంలో డాక్టర్ బండి జన్మస్థలమైన కందుకూరు గ్రామ ప్రజలకు ఉచితంగా ఈ వైద్య శిబిరం ద్వారా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ వైద్య శిబిరంలో విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని హెట్రో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్